బహుజన, స్త్రీ జన విమోచకుడు డాక్టర్ అంబెడ్కర్ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

బహుజన, స్త్రీ జన విమోచకుడు డాక్టర్ అంబెడ్కర్

అంబెడ్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ
అమరావతిలో డాక్టర్ అంబెడ్కర్ 125 అడుగులు విగ్రహాన్ని వెంటనే పూర్తి చేయాలి - చేజర్ల

కోవూరు, డిసెంబర్‌ 06, (రవికిరణాలు) : బహుజన,స్త్రీ జన విమోచకుడు డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ ని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ 63వ వర్ధంతి సందర్భంగా కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయములో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి,కోవూరు దళితవాడ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడము జరిగినది.ఈ సందర్భంగా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టిన అంబెడ్కర్ కఠోర శ్రమతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అదిరోహించి దేశంలోని బహుజనులు,మహిళల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసి దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజ్యాంగం రచించే అవకాశం వచ్చిన తరువాత రాజ్యాంగం లో వారికి హక్కులు కల్పించారని,ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని దేశానికి అందించిన మహనీయుడు అంబెడ్కర్ ని,వారి ఆశయాలను తెలుగుదేశం పార్టీ ఆచరణలో పెట్టిందని, నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులు గా ఉన్న సమయంలో దళితుల,గిరిజనుల,మహిళల అభ్యున్నతికి పెద్ద పీట వేసి అంబెడ్కర్ ఆశయాలను అమలు చేసారని, ఎన్టి రామారావు చైర్మన్ గా ఉన్న నేషనల్ ప్రేంట్ అధికారం లో ఉన్న సమయములో అంబెడ్కర్ కి భారతరత్న ఇవ్వడము జరిగినదని,దళితులైన మహేంద్రనాధ్ ని ఆర్ధిక శాఖ ఇచ్చి, బాలయోగి ని లోకసభ స్పీకర్ గా, ప్రతిభా భారతిని శాసనసభ స్పీకర్ గా చేసి దళితులకు పెద్ద పీట వేసిందని,అదేవిధంగా అమరావతిలో అంబెడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని, ఆయన పేరిట స్మృతి వనాన్ని నారా చంద్రబాబు నాయుడు మొదలు పెట్టి యున్నారని వాటిని ప్రస్తుత వైస్సార్సీపీ ప్రభుత్వం నిలిపివేసిందని వాటి పనులను వెంటనే మొదలు పెట్టి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దారా విజయబాబు, గిద్దలూరు ఉమ, ఏలూరు కృష్ణయ్య, ఇంటూరు విజయ, మామిడి మురళి, కావలి ఓంకార్, ఉయ్యురు వేణు, కలికి సత్యనారాయణ రెడ్డి, కలువాయి చెన్నకృష్ణా రెడ్డి, బత్తాల రమేష్, మహమ్మద్, సోమవరపు సుబ్బారెడ్డి,మౌలాలి, పాశం పరందామయ్య, పడవల ఆదిశేషయ్య, పొబ్బారెడ్డి మల్లిఖార్జున రెడ్డి, నారాయణ రెడ్డి, గరికిపాటి అనిల్, చెంచమ్మ, పారా సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.

బహుజన, స్త్రీ జన విమోచకుడు డాక్టర్ అంబెడ్కర్ Reviewed by CHANDRA BABU on December 06, 2019 Rating: 5 అంబెడ్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అమరావతిలో డాక్టర్ అంబెడ్కర్ 125 అడుగులు విగ్రహాన్ని వెంటనే పూర్తి చేయాలి - చేజర్ల ...

No comments: