పేటలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు ఘన నివాళి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

పేటలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు ఘన నివాళి

సూళ్లూరుపేట, డిసెంబర్‌ 06, (రవికిరణాలు) : సూళ్లూరుపేట పట్టణ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ అంబెడ్కర్ విగ్రహం వద్ద ఏఎస్‌పిఎస్ అంబేడ్కర్ సిదాంత ప్రచార సమితి ఆధ్వర్యంలో అంబెడ్కర్ 63వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్‌పిఎస్‌ నేతలు భారత రత్న నవ భారత రాజ్యాంగం నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేడ్కర్ ని కొనియాడారు. అంబెడ్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. దళిత రాజ్యం సాధన కొరకు పాటుపడాలని కృషి చేయాలని దళితులు అందరూ సంగటితం కావాలని ఏఎస్‌పిఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అక్కరపాక చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌పిఎస్‌ జిల్లా అధ్యక్షుడు కెవి కృష్ణయ్య, టీచర్ మునస్వామి కన్నాంబకం మునిరత్నం, సూళ్లూరుపేట, దొరవరిసత్రం, తడ, మండలాల అధ్యక్షుడు సుధీర్, వాటంబెటి ప్రతాప్, దనుంజయ్య, చెంగయ్య, నెల్లిపూడి చెంగయ్య తదితరలు పాల్గొన్నారు.
పేటలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు ఘన నివాళి Reviewed by CHANDRA BABU on December 06, 2019 Rating: 5 సూళ్లూరుపేట, డిసెంబర్‌ 06, (రవికిరణాలు) : సూళ్లూరుపేట పట్టణ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ అంబెడ్కర్ విగ్రహం వద్ద ఏఎస్‌పిఎస్ అంబేడ్కర్ సిదాంత ప...

No comments: