ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న సి.ఏ.ఏ చట్టం రద్దు చేయాలి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న సి.ఏ.ఏ చట్టం రద్దు చేయాలి


వెంకటగిరి, డిసెంబర్‌ 19, (రవికిరణాలు) : పౌరసత్వ సవరణ చట్టంలో భాగంగా హిందూ ముస్లింల మధ్య విభేదాలను పెంచే సి.ఏ.ఏ, యన్.ఆర్.సి చట్టాలను రద్దు చేయాలని గురువారం ఉదయం ముస్లిం సోదరులు, సిపిఐ,సిపియమ్, జన విజ్ఞాన వేదిక, రైతు కూలి సంఘం నాయకులు పుర విధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద మసీదు ఇమామ్ మహమ్మద్ సిరాజ్, ముస్లిం మత పెద్ద కరిముల్లా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మతం ప్రాతిపదికన పౌరసత్వం నిర్ణయించడం సరికాదని అన్నారు. మేము ఇక్కడే పుట్టము,ఇక్కడే ప్రాణాలు విడుస్తామే తప్ప మమ్ములను పౌరసత్వం చట్టం ద్వారా విపక్షత చూపడం సరికాదని అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాజ్యాంగంలో 19వ ఆర్టికల్ ని అనుసరించి అందరికి పౌరసత్వ హక్కుని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు వి.వి రమణ రెడ్డి, రైతు కూలి సంఘం నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి రమణ,కమ్యూనిస్టు పార్టీ నాయకులు బాలకృష్ణయ్య, వడ్డిపల్లి చెంగయ్య తదితరులు పాల్గొన్నారు.
ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న సి.ఏ.ఏ చట్టం రద్దు చేయాలి Reviewed by CHANDRA BABU on December 19, 2019 Rating: 5 వెంకటగిరి, డిసెంబర్‌ 19, (రవికిరణాలు) : పౌరసత్వ సవరణ చట్టంలో భాగంగా హిందూ ముస్లింల మధ్య విభేదాలను పెంచే సి.ఏ.ఏ, యన్.ఆర్.సి చట్టాలను రద...

No comments: