- రూ.16,80,000 విలువ చేసే నిషేధిత గుట్కాలు, అక్రమ మద్యం, కారు స్వాధీనం
పొదలకూరు, డిసెంబర్ 03, (రవికిరణాలు) : మద్యం బెల్టు దుకాణాలు, గుట్కాలు, నిషేధిత పొగాకు ఉత్పత్తులపై ఉక్కుపాదం మోపాలని జిల్లా యస్పి ఐశ్వర్య రస్తోగి ఆదేశాల మేరకు, ఆత్మకూరు డిఎస్పి ఎస్.మక్బుల్ పర్యవేక్షణలో పొదలకూరు సిఐ బి.గంగాధర రావు ఉత్తర్వుల మేరకు, పొదలకూరు ఎస్.ఐ. కె.రహీం రెడ్డికి రాబడిన సమాచారం మేరకు ఎస్.ఐ వారి సిబ్బంది సుబ్బారావు, నరసయ్య, సురేష్, శ్రీనివాసులు రెడ్డి, అంకయ్య, నరసింహతో కలిసి మంగళవారం తెల్లవారు జామున 01.00 గంటలకు పొదలకూరులోని సంగంరోడ్డు సెంటర్ వద్ద వాహనాలు తనిఖీ చేయుచుండగా ఏపి26ఏకె5288 నెంబర్ గల కారు, రాంనగర్ గేటు సెంటర్ వైపు నుండి అతివేగముగా నెల్లూరు వైపు వస్తుండగా ఆపుటకు ప్రయత్నించగా, కారు ఆగకుండా నెల్లూరు పైపు వెళుతుండగా, ఎస్.ఐ వారి సిబ్బందితో వెంటాడి సదరు కారును మరుపూరు గ్రామ సమీపములో ఆపి తనికీ చేయగా, కారు డిక్కీలో ప్రభుత్వముచే నిషేదించబడిన గుట్కాలు 10 బస్తాలు కారుని స్వాధీనం చేసుకోని, తరువాత కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు కలువాయి మండలం, వెరుబోట్లపల్లి గ్రామములో అనుమాలసెట్టి వెంకటేశ్వర్లు యొక్క గోడౌన్ లో తనిఖీ చేయగా, 54 బస్తాల గుట్కాలు 305 క్వార్టర్ బాటిల్స్ 21 ఫుల్ బాటిల్స్ అక్రమ మద్యం సీసాలను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగినది. చేజర్ల గ్రామానికి చెందిన చిలక మనోహర్, వేరుబోట్లపల్లి గ్రామానికి చెందిన అనుమాలసెట్టి వెంకటేశ్వర్లు గుట్కా మాఫియాగా ఏర్పడి, షేక్ సులేమాన్ సహాయముతో బెంగళూరు నుండి తక్కువ ధరకు ప్రభుత్వముచే నిషేదించబడిన గుట్కాలను కొనుగోలు చేసి, వాటిని నిల్వ చేసి, అధిక ధరలకు జిల్లాలో పలుచోట్ల అమ్ముతున్నట్లు కేసు నమోదు పరిచి ఎస్.ఐ దర్యాప్తు చేయుచున్నారు.

No comments: