కోవూరు, డిసెంబర్ 12, (రవికిరణాలు) : నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి శాసనసభ్యుడిగా ఎన్నికయిన వెంటనే నేను అవినీతిని సహించనని,మా పార్టీ వారు ఎక్కడయినా అవినీతికి పాల్పడితే నాదృష్టికి తీసుకువస్తే వారి పై చర్యలు తీసుకుంటానని చెప్పారని,నేడు మలిదేవి టెండర్ల లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని నిన్న,నేడు పత్రికలలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయని కావున ఆయన ఈ టెండర్ల ను రద్దు చేయించి నిజాయతీ నిరూపించుకోవాలని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు.గురువారం కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయములో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ మలిదేవి డ్రెయిన్ టెండర్ల లో కాంట్రాక్టర్లు ను టెండర్ వేయకుండా కోవూరు నియోజకవర్గ అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నట్లు పత్రికలలో వార్తలు వచ్చాయని,ఈ విషయము ప్రసన్నకుమార్ రెడ్డికి తెలిసి జరిగిందో, తెలియక జరిగిందో మాకు తెలియదని,నిజంగా ఆయనకు తెలియకుండా జరిగుంటే ఆయన వెంటనే ఆ టెండర్లు ను రద్దు చేయించి నిజాయితీ నిరూపించుకోవాలని లేని పక్షంలో ఈ వ్యవహారం అంతా ఆయనకు తెలిసే జరిగిందని అనుకోవలసి వస్తుందని, వీలైనంత ఎక్కువ మంది టెండర్ల లో పాల్గొనే అవకాశం కల్పించి పోటీ పెంచి ప్రజా ధనం ఆదా చేసేందుకే రివర్స్ టెండర్ విధానం తెచ్చామని ముఖ్యమంత్రి చెపుతున్నారు ఇక్కడేమో వారి పార్టీ వారు ఎవరిని టెండర్లు వేయకుండా అడ్డు కుంటున్నారని దీనిని బట్టి ఇవి రివర్స్ టెండర్లు కాదు,రిజర్వ్ టెండర్లు అని అర్ధమవుతుందని,నిన్న ఉదయం 10 గంటల నుండి తన కార్యాలయములో ఉండి కాంట్రాక్టర్లు దగ్గర బిజి లు తీసుకోవలసిన నీటిపారుదల శాఖ ఎస్.ఇ అందుబాటులో లేకుండా చివరి 10 నిమిషాలు ముందు వచ్చి కంప్యూటర్ రూమ్ లోకి వెళ్లి అధికార పార్టీ చూసించిన ఇద్దరు కాంట్రాక్టర్లు వద్ద మాత్రం బిజి లు తీసుకొని మిగిలిన కాంట్రాక్టర్లుకు దగ్గర బిజి లు తీసుకోలేదని దీనిని బట్టి ఈ టెండర్లు ఎంత పారదర్శకంగా జరుగుతున్నాయో అర్ధమౌతుందని,కోవూరు రైతాంగము కొరకు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మలిదేవి డ్రయిన్ ఆధునికీకరణ కోసం 73 కోట్లు మంజూరు చేయగా ఎన్నికల కోడ్ రావడము వలన టెండర్లు పిలవలేదని,నేడు వైస్సార్సీపీ ప్రభుత్వం టెండర్లు
పిలిసిందని,అయితే ఈ టెండర్ల లో అక్రమాలు జరుగుతున్నాయని ఇప్పటికయినా ప్రభుత్వానికి,నీటి పారుదల శాఖ మంత్రి కి, కోవూరు శాసనసభ్యునికి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్న ఈ టెండర్లను రద్దు చేసి మరలా టెండర్లు పిలిసి స్వేచ్ఛగా టెండర్లు వేసే అవకాశం కల్పించాలని,అదేవిధముగా నిన్న కాంట్రాక్టర్లు దగ్గర బిజి లు తీసుకోని ఎస్.ఈ పై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాము.ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుమల్లి శ్రీహరి రెడ్డి, కలికి సత్యనారాయణ రెడ్డి, కావలి ఓంకార్, వీరాంశెట్టి మధుసూదన్ రావు, శివుని రమణారెడ్డి, ఇందుపురు మురళీకృష్ణ రెడ్డి, సోమవరపు సుబ్బారెడ్డి, కలువాయి చెన్నకృష్ణా రెడ్డి, పులా వెంకటేశ్వర్లు, గుంజి పద్మనాభం, దువ్వూరు రంగారెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments: