- కమిషనర్ పివివిస్ మూర్తి
నెల్లూరు, డిసెంబర్ 16, (రవికిరణాలు) : నగర పాలక సంస్థ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించి మోడల్ పరీక్షల ద్వారా ఆత్మస్థైర్యం పెంచేందుకు కృషి చేస్తున్నామని కమిషనర్ పివివిస్ మూర్తి ప్రకటించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశాన్ని ఆయన కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మొత్తం 15 పాఠశాలల్లో 1300 మంది విద్యార్థులు ఈ విద్యాసంవత్సరంలో పదవ తరగతి పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ పాఠశాలల్లో మోడల్ పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ప్రత్యేక తరగతుల ద్వారా శిక్షణ అందించనున్నామని కమిషనర్ వివరించారు. ముందస్తు మోడల్ పరీక్షల ద్వారా విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని తగ్గించి, తర్ఫీదు పొందాల్సిన సబ్జెక్టులపై పూర్తి స్థాయి అవగాహన కలుగుతుందని ఆయన వెల్లడించారు.

No comments: