సమస్యల పరిష్కారం పేరుతో టిడిపి నాటకాలాడుతోంది - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

సమస్యల పరిష్కారం పేరుతో టిడిపి నాటకాలాడుతోంది

- మాజీ మేయర్ ముక్కాల ద్వారకనాథ్
నెల్లూరు, డిసెంబర్‌ 02, (రవికిరణాలు) : నెల్లూరు నగరంలోని నవాబుపేట నందు గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ముక్కాల ద్వారకనాథ్ మాట్లాడుతూ హౌసింగ్ ఫర్ ఆల్ పథకంలో పేద ప్రజలకు ఇవ్వాల్సిన ఇళ్ళను ఇవ్వడం లేదని, వాటిని చెందాల్సిన విధంగా ప్రజలతో సమస్య మీది - పరిష్కారం, పోరాటం మాది అనే అంశంపై మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడడం జరిగిందన్నారు. కాని గడిచిన ఐదేళ్ళలో గుర్తుకు రాని సమస్యలు పరిష్కారం కార్యక్రమం, ఈ ఐదు నెలల కాలంలోనే సమస్యలు వచ్చాయా ప్రశ్నిస్తున్నానన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతి వర్గానికి, ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తుండడం అందరికీ తెలిసిన విషయం అన్నారు. సమస్యల పరిష్కారం అనే కార్యక్రమానికి అబ్దుల్ అజీజ్ ముందుకు రావడం సిగ్గుచేటని, గత ప్రభుత్వంలో ఉన్న సమస్యలే ఇప్పటికీ ఉన్నాయని, అన్నింటినీ పరిష్కరించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకేస్తోందన్నారు. ఏదైనా ఓ నిర్మాణం చేపడితే ఒక చ|ఆ|| 1000 రూపాయలు ఖర్చు అవుతుందని సామాన్య మానవుడి నుంచి బిల్డర్ వరకు తెలిసిన విషయమే అని, కాని ఒక కొత్త టెక్నాలజీని ప్రవేశపెడితే 1000 నుంచి కొంత మొత్తం తగ్గాల్సిందిపోయి, భారతదేశంలోనే ఎక్కడా లేనివిధంగా గత ప్రభుత్వంలో మంత్రులకు, మేయర్లకు మాత్రమే షేర్ వాల్ టెక్నాలజీ కనిపించిందని, ఆ టెక్నాలజీలో "షేర్" బాగా కనిపించి మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగిందన్నారు. షీర్ వాల్ టెక్నాలజీ పేరుతో చ| అ| 2300 రూపాయల అదనపు భారం మోపి కోట్ల రూపాయలు దోపిడీ చేసింది. వాస్తవమా కాదా అని ప్రశ్నిస్తున్నానన్నారు. గత ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమాలను అందిచాలన్న ఆలోచన లేకుండా, అరచేతిలో సంక్షేమాలను చూపించి.. సంక్షేమంలో ఉన్న ఫలాలను పూర్తి స్థాయిలో టిడిపి ప్రభుత్వం తీసిందన్నారు. జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఏవైతే హామీలీచ్చారో, అన్నీ ప్రజలకు అందిస్తూ ముందుకెళ్తున్నారని, అలాగే మంత్రి అనీల్ కుమార్ ప్రతిపక్ష శాసనసభ్యునిగా ఉన్నప్పుడు పేదలైన అర్హులందరికీ ఇళ్ళను ఉచితంగా ఇచ్చి, ఆడపడుచుల పేరుతో ఇళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తే తద్వారా వారికి ఆస్తి అంటూ ఏర్పడి భరోసా కల్పించినట్లవుతుందని ముందు నుంచి చెప్పడం జరిగిందన్నారు. పేద ప్రజలకు అండగా నిలబడి, పోరాటం చేయడం మాత్రమే తెలుసని మంత్రి అనీల్ కుమార్ చెప్పు వచ్చారని.. ఆ దిశగానే ఆయన ముందుకెళ్తున్నారన్నారు. మాట తప్పని.. మడమ తిప్పని నాయకులెవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, మంత్రి అనీల్ కుమార్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానన్నారు. హౌసింగ్ ఫర్ ఆల్, ప్లాట్ల విషయాల్లో ప్రజలెవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, ఎవరూ బ్యాంకులకు అప్పు కట్టాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్పడం జరిగిందన్నారు. ప్రజలను అడ్డు పెట్టుకొని పరిష్కార కార్యక్రమం అనే పేరుతో నాటకాలు ఆడుతున్నారని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. 2014లో ఎన్నో అబద్దాలు చెప్పి టిడిపి అధికారంలోకి వచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, 2019లో ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలన్నింటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, లక్షల ఉద్యోగాలు కల్పించి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆరిసిపి నాయకులు దామవరపు రాజశేఖర్, కర్తం ప్రతాప్ రెడ్డి, పోలంరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, ఓబిలి రవిచంద్ర,దొందాలి రము, కొండా శివారెడ్డి, తంబి, గణేశం వెంకటేశ్వర్లురెడ్డి, వేనాటి శ్రీకాంతారెడ్డి, ఊటుకూరు నాగార్జున, నాగరాజు, బి.సత్యకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారం పేరుతో టిడిపి నాటకాలాడుతోంది Reviewed by CHANDRA BABU on December 02, 2019 Rating: 5 - మాజీ మేయర్ ముక్కాల ద్వారకనాథ్ నెల్లూరు, డిసెంబర్‌ 02, (రవికిరణాలు) : నెల్లూరు నగరంలోని నవాబుపేట నందు గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ ...

No comments: