నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి తెలిపిన కేంద్రం
నెల్లూరు, డిసెంబర్ 02, (రవికిరణాలు) : దేశంలోని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో నిబంధనల మేరకే మందుల కొనుగోళ్లు జరుపుతున్నామని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. హైదరాబాదులోని ఈఎస్ఐ ఆసుపత్రుల్లో చోటుచేసుకున్న కుంభకోణాల గురించి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లోక్సభలో సోమవారం ప్రశ్నించారు. ఈ మేరకు ఎవరినైనా అరెస్టు చేశారా? ఈఎస్ఐ ఆసుపత్రుల్లో ఎటువంటి చర్యలు తీసుకున్నారని కూడా ప్రశ్నించారు. దీనికి కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ సమాధానం చెబుతూ ఒక అధికారిని అరెస్టు చేసినట్టు పత్రికల్లో వార్తలు రావడంతో, ఆ సమాచారం మా వద్దకు చేరిందని లిఖితపూర్వకంగా తెలిపారు. దీంతో ఎప్పటికప్పుడు మందుల కొనుగోళ్లలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మందుల ధరల నిర్ధారణలో కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తున్నామని, అదేవిధంగా ఆర్థిక లావాదేవీల్లో నిబంధనలకు అనుగుణంగా వ్యవహారాలు జరిగేటట్టు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

No comments: