సాగునీటి సమస్యలను అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

సాగునీటి సమస్యలను అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలి

మభ్యపెట్టే విధంగా నివేదికలు ఇవ్వొద్దు...ఆనం రామనారాయణ రెడ్డి

నెల్లూరు, డిసెంబర్‌ 05, (రవికిరణాలు) : ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో తెలుగుగంగ ప్రాజెక్టు కాలువల ఆయకట్టు రైతాంగానికి సాగు నీటి సరఫరాలో అధికారులు చిత్తశుద్ధితో సకాలంలో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. గురువారం నెల్లూరు నగరంలోని తెలుగు గంగ సూపరిండెంట్ ఇంజనీర్ వారి కార్యాలయం నందు సంబంధిత అధికారులతో వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి, సైదాపురం, రాపూరు మండల పరిధిలోని తెలుగుగంగ ఆయకట్టు రైతాంగానికి చివరి ఆయకట్టు వరకు నిరంతరాయంగా సాగునీరు అందించే విషయంలో అధికారులంతా అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు-ఎస్ ఎస్ కెనాల్ పునరుద్ధరణ కోసం కండలేరు రెజర్వాయర్ గ్రౌటింగ్ పనులను సంక్రాంతిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్, వెలుగోను లిఫ్ట్ పథకంతో పాటు చాగణం రాజుపాలెం లిఫ్ట్ పునరుద్ధరణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాల్సినదిగా సూచించారు. ఆల్తూరుపాడు లిఫ్ట్ ద్వారా మెర్లపాక వరకు పంపింగ్ వల్ల చిత్తూరు జిల్లా అవసరాలకు నీటి తరలింపు జరుగుతుంది తప్ప వెంకటగిరి నియోజకవర్గ ప్రాంత రైతాంగానికి ప్రయోజనం లేదని అందుకు ఎస్ ఎస్ కెనాల్ పనులను పునరుద్దరించడమే ఉత్తమ మార్గమని తెలిపారు. పునరావాస ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనుల పై దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎస్‌ఇ హరి నారాయణ రెడ్డి పలువురు ఇఇ లు, డిఇఇ లు, ఏఇ లు హాజరయ్యారు.
సాగునీటి సమస్యలను అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలి Reviewed by CHANDRA BABU on December 05, 2019 Rating: 5 మభ్యపెట్టే విధంగా నివేదికలు ఇవ్వొద్దు...ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు, డిసెంబర్‌ 05, (రవికిరణాలు) : ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో తెలుగుగంగ ప్రాజె...

No comments: