బ్రాహ్మణ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిన జగన్ ప్రభుత్వం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

బ్రాహ్మణ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిన జగన్ ప్రభుత్వం

పెన్షన్లు రాక ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న పేద బ్రాహ్మణులు
స్కాలర్‌షిలు రాకుండా ఇబ్బంది పడుతున్న విద్యార్దులు
యల్.వి.సుబ్రహ్మణ్యం అవమానకర బదలీ బ్రాహ్మణ హిందూ వ్యతిరేక విధానాలకు నిదర్శనం
నెల్లూరు, డిసెంబర్‌ 13, (రవికిరణాలు) : భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ రాజకీయ పార్టీ ఆలోచించని విధంగా పేద బ్రాహ్మణుల సంక్షేమం కొరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తన పాదయాత్రలో పేద బ్రాహ్మణుల ఆర్ధిక స్థితిగతులను స్వయంగా పరిశీలించి తాను అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలోనే మొట్టమొదటగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 385 కోట్ల రూపాయలు కేటాయించి అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి 1,54,000 వేల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరిస్తే, నేడు అధికారంలోకి వచ్చిన జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో 1000 కోట్లు కేటాయిస్తానని అబద్దపు వాగ్దానాలతో బ్రాహ్మణులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు చివరి సంవత్సరం ఎన్నికల ముందు ఓట్ ఆన్ అకౌంట్‌లో కేటాయించిన 100 కోట్ల రూపాయలనే వార్షిక బడ్జెట్ లో ఖరారు చేసి, ఆర్థిక సంవత్సరం 9 మాసాలు పూర్తి అవుతున్నాకూడా ఈనాటి వరకు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయకుండా కార్పొరేషను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో వున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌తో పాటు 29 మంది ఒప్పంద ఉద్యోగులతో నడుస్తూ సకాలంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కార్పొరేషన్ నిర్వీర్యం చేయాలనే ఉద్దేశ్యంతో ఉద్యోగుల మొత్తాన్ని తొలగించి కేవలం ఇన్ చార్జి మేనేజింగ్ డైరెక్టర్ తో పాటు ఒక అటెండర్ ను మాత్రమే ఉంచి కనీస సమాచారం కూడా ఇచ్చే ఉద్యోగులు లేకుండా కార్పొరేషన్ మూసివేసే స్థితికి తెచ్చారు.చంద్రబాబునాయుడు ప్రభుత్వం 4 సంవత్సరాల కాలంలో 1,54,000 మంది లభ్యదారులకు 285 కోట్లు ఖర్చుచేస్తే ఈ ఆర్థిక సంవత్సరం 9 నెలలు పూర్తి అవుతున్నా ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయకపోవడం దారుణమన్నారు.
బ్రాహ్మణ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిన జగన్ ప్రభుత్వం Reviewed by CHANDRA BABU on December 13, 2019 Rating: 5 పెన్షన్లు రాక ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న పేద బ్రాహ్మణులు స్కాలర్‌షిలు రాకుండా ఇబ్బంది పడుతున్న విద్యార్దులు యల్.వి.సుబ్రహ్మణ్యం అవమానకర బదలీ...

No comments: