జిల్లా కేంద్ర కారాగారాన్ని సందర్శించిన యస్పి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

జిల్లా కేంద్ర కారాగారాన్ని సందర్శించిన యస్పి

నెల్లూరు, డిసెంబర్‌ 09, (రవికిరణాలు) : జిల్లా కేంద్ర కారాగారాలు నేరస్తులలో కూడా ఎన్నో పని నైపుణ్యాలు దాగి ఉంటాయని, వాటిని పూర్తి స్థాయిలో వివిధ వస్తువుల తయారీకి అన్వయించడం జరుగుతుందని, అలాంటి కార్యక్రమాలను తిలకించవలసిందిగా జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ ని జైల్ సూపరింటెండెంట్ యం.ఆర్.రవికిరణ్ ఆహ్వానించడం జరిగింది.ఈ క్రమంలో నేర న్యాయ వ్యవస్థలో అంతిమంగా ప్రధాన పాత్ర పోషించే దిద్దుబాటు విభాగం అయిన నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్ ను యస్పి సోమవారం డిటిసలో మహిళా కార్యదర్శుల శిక్షణ ప్రారంభం కార్యక్రమం అనంతరం సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా జైల్ సూపరింటెండెంట్ జిల్లా యస్పికి ఖైదీల ద్వారా తయారు చేయబడుతున్న వివిధ ఉత్పత్తులు అయిన స్టీల్ ఫర్నిచర్, షాంపులు, కోకోనట్ ఆయిల్, టూత్ పేస్ట్, టాయ్ లెట్ క్లీనర్ మొదలగు తయారీ విభాగాల గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాయస్పి ఖైదీల యొక్క నైపుణ్యాలను జైలు విభాగంలోని ఉన్నత స్థాయి ఉత్పత్తి యూనిట్ లను నిర్వహిస్తున్న అధికారులను, సిబ్బందిని ప్రసంశించి అభినందించారు.ఈ సందర్శనలో జిల్లా యస్పి తో పాటు జైల్ సూపరింటెండెంట్, యస్.బి. డియస్పి యన్.కోటారెడ్డి, నెల్లూరు రూరల్ డియస్పి కె.వి. రాఘవ రెడ్డి, నెల్లూరు రూరల్ సి.ఐ. రామకృష్ణ, వి.సత్రం యస్.ఐ. జిలానీ, యస్.బి. యస్.ఐ. వెంకట సాయి, జైల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా కేంద్ర కారాగారాన్ని సందర్శించిన యస్పి Reviewed by CHANDRA BABU on December 09, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌ 09, (రవికిరణాలు) : జిల్లా కేంద్ర కారాగారాలు నేరస్తులలో కూడా ఎన్నో పని నైపుణ్యాలు దాగి ఉంటాయని, వాటిని పూర్తి స్థాయిలో వ...

No comments: