- పశు వైద్యాధికారి డాక్టర్ మదన్ మోహన్
నెల్లూరు, డిసెంబర్ 18, (రవికిరణాలు): నగరంలోని రోడ్లపై సంచరిస్తూ ట్రాఫిక్ అంతరాయాలకూ, ప్రమాదాలకు కారణమవుతున్న జంతువుల ఏరివేతలో భాగంగా 15 పశువులను గోశాలకు తరలించామని నగర పాలక సంస్థ పశు వైద్యాధికారి డాక్టర్ మదన్ మోహన్ పేర్కొన్నారు. పశు వైద్యాధికారి ఆధ్వర్యంలో బుధవారం ఆరోగ్య శాఖ సిబ్బంది నగరంలోని పొదలకూరు రోడ్డు, సారాయి అంగడి సెంటర్, పద్మావతి సెంటర్ తదితర ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్లపై సంచరిస్తున్న పశువులను గుర్తించి ప్రత్యేక వాహనంలో వాటిని కల్లూరుపల్లిలోని గోశాలకు తరలించారు. డాక్టర్ మదన్ మోహన్ మాట్లాడుతూ జంతువుల యజమానులు వాటిని సంరక్షించుకునే ప్రయత్నాలు చేయాలని, లేకుంటే ఒకసారి గోశాలకు తరలించిన జంతువులను వదిలే ప్రసక్తే ఉండబోదని స్పష్టం చేసారు.

No comments: