అమరజీవికి నివాళులర్పించిన మంత్రి అనీల్ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

అమరజీవికి నివాళులర్పించిన మంత్రి అనీల్

నెల్లూరు, డిసెంబర్‌ 15, (రవికిరణాలు) : అమరజీవి పొట్టి శ్రీరాములు 67వ వర్థంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా|| పి.అనీల్ కుమార్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అనీల్ కుమార్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములుకు రాష్ట్రమంతటా ప్రభుత్వం తరఫున ఘనమైన నివాళులర్పించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ ఐదేళ్ళ పాలనలో పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా ప్రభుత్వం నిర్వహించిన దాఖలాలు లేవన్నారు. వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా చేపట్టడం జరుగుతోందన్నారు. నెల్లూరు జిల్లా, తెలుగు బిడ్డగా పొట్టి శ్రీరాములుకు భారతరత్న ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలుగు ప్రజలందరూ ఒకటిగా ఉండాలని రాష్ట్రం కోసం ప్రాణాలొడ్డిన ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్ళి, ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంవి.శేషగిరిబాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్, వైఎస్ఆర్ సిపి నాయకులు ముక్కాల ద్వారకనాథ్, పి.రూప కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
అమరజీవికి నివాళులర్పించిన మంత్రి అనీల్ Reviewed by CHANDRA BABU on December 15, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌ 15, (రవికిరణాలు) : అమరజీవి పొట్టి శ్రీరాములు 67వ వర్థంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండు వద్ద ఉన్న ఆయన వి...

No comments: