రివర్స్ టెండర్ ద్వారా పోలవరంలో ఆదా చేసామన్నారు - చేజర్ల - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

రివర్స్ టెండర్ ద్వారా పోలవరంలో ఆదా చేసామన్నారు - చేజర్ల

మలిదేవి డ్రైయిన్ లో ఎందుకు ఆదా చేయలేదో ప్రసన్నకుమార్ రెడ్డి చెప్పాలి

వెంకటగిరి నియోజక వర్గంలో 26.72 శాతం లెస్, కోవూరు నియోజక వర్గంలో 4.19 శాతం లెస్ దీనిలో మర్మమేమిటి
కోవూరు, డిసెంబర్‌ 15, (రవికిరణాలు) : దేశంలోనే ఎక్కడ లేని విధంగా రివర్స్ టెండర్ విధానం తెచ్చి పోలవరం ప్రాజెక్టులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా ధనాన్ని ఆదా చేసారని పదే పదే చెప్పే కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తన నియోజకవర్గ పరిధిలో జరిగిన మలిదేవి డ్రైయిన్ టెండర్లలో ప్రజా ధనాన్ని ఎందుకు ఆదా చేయలేదో చెప్పాలని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. ఆదివారం కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయములో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ కేవలం రెండు రోజుల వ్యవధిలో ఇరిగేషన్ శాఖలో జరిగిన టెండర్ల లో వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని అల్తూరుపాడు ప్రాజెక్టు టెండర్ల లో అక్కడి నాయకులు జోక్యం చేసుకోకపోవడం వలన స్వేచ్ఛ గా కాంట్రాక్టర్లు రివర్స్ టెండర్లో పాల్గొనడము వలన 26.72 శాతం లెస్ తో టెండర్లు ముగిసినవని,అదే కోవూరు నియోజకవర్గం లో నాయకులు జోక్యం చేసుకొని కాంట్రాక్టర్లు ను బి జి లు ఇవ్వకుండా బెదిరించడము తో కేవలం 4.19 శాతం మాత్రమే లెస్ కు టెండర్ అధికారపార్టీ నాయకులు చెప్పిన ఆర్.కె.ఎన్ సంస్థకు దక్కిందని,కాంక్రీట్ పనులు ఎక్కువుగా ఉన్న అల్తూరుపాడు ప్రాజెక్టు టెండర్ 26.72 శాతం లెస్ కు పొతే,20 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని ఉండే మలిదేవి డ్రైయిన్ కేవలం 4.19 శాతం లెస్ పోయిందంటే ఇక్కడ ఏమి జరిగిందో అర్ధమవుతుందని,ఈ రెండు టెండర్ల మధ్య వ్యత్యాసం 22.53 శాతం ఉందని,కేవల రాజకేయ జోక్యంతోనే మలిదేవి టెండర్ల లో తక్కువ లెస్ కు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ కె ఎన్ సంస్థకు టెండర్లు వచ్చే విధంగా అధికారపార్టీ చక్రం తిప్పిందని దీనిని బట్టి కోవూరు నియోజకవర్గము లో రివర్స్ టెండర్లు జరగటం లేదని కేవలం రిజర్వ్ టెండర్లు మాత్రమే జరుగుతున్నాయని, మలిదేవి టెండర్ దక్కించుకున్న ఆర్ కె ఎన్ సంస్థ గతములో తెలుగుదేశం ప్రభుత్వ హాయములో 30 కోట్ల విలువ చేసే పనికి టెండర్ వేయగా 30 కోట్ల విలువ చేసే పనికి తగని అర్హతలు ఈ కాంట్రాక్టరు లేవని వైస్సార్సీపీ ఫిర్యాదులు చేసిందని ఇప్పుడు వీరికి 72 కోట్లు పనులు చేసే అర్హతలు ఎలా వచ్చాయో అధికార పార్టీ చెప్పాలని,ఇప్పటికయినా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న మలిదేవి డ్రైయిన్ టెండర్లను రద్దు చేయించి మరలా టెండర్లు పిలిపించి స్వచ్ఛ గా టెండర్లు జరిపించాలని కోరుతున్నాము.ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దారా విజయబాబు, శివుని రమణారెడ్డి, వీరాంశెట్టి మధుసూదన రావు, కలువాయి చెన్నకృష్ణా రెడ్డి, ఇందుపురు మురళీకృష్ణ రెడ్డి, గొర్రెపాటి నరసింహ, ఉయ్యురు వేణు, మారుబోయిన వెంకటేశ్వర్లు,గుంజి పద్మనాభం, వల్లెపు సురేష్, ప్రశాంత్, సోమవరపు సుబ్బారెడ్డి, గరికిపాటి అనీల్, దువ్వూరు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రివర్స్ టెండర్ ద్వారా పోలవరంలో ఆదా చేసామన్నారు - చేజర్ల Reviewed by CHANDRA BABU on December 15, 2019 Rating: 5 మలిదేవి డ్రైయిన్ లో ఎందుకు ఆదా చేయలేదో ప్రసన్నకుమార్ రెడ్డి చెప్పాలి వెంకటగిరి నియోజక వర్గంలో 26.72 శాతం లెస్, కోవూరు నియోజక వర్గంలో 4.19 శా...

No comments: