వైసీపీ కార్యకర్తలుగా, తొత్తులుగా పోలీసులు వ్యవహరించడం సిగ్గు చేటు : కాకర్ల తిరుమల నాయుడు
నెల్లూరు, డిసెంబర్ 06, (రవికిరణాలు) : తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టిఎన్‌ఎస్‌ఎఫ్) జిల్లా అధ్యక్షులు కాకర్ల తిరుమల నాయుడు ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యాలయం నందు శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు కాకర్ల తిరుమలనాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర మంత్రులు, వైసీపీ నేతలు విచ్చలవిడిగా అసభ్య పదజాలంతో బూతు పదాలు వినియోగిస్తూ టిడిపి నేతలపై, ఇతర ప్రజాసంఘాల నేతలపై, ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం అడ్డుకోవద్దని కోరుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తే వైసీపీకి చెందిన పెయిడ్ ఆర్టిస్టులు, వైసిపి కార్యకర్తలు బస్సు పైకి రాళ్లు చెప్పులతో దాడులకు తెగబడగా రక్షణ కల్పించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ప్రజల భావప్రకటన స్వేచ్ఛలో ఈ దాడి ఒక భాగమని సాక్షాత్తు రాష్ట్ర డిజిపి నిర్లక్ష్యంగా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను ఖండిస్తూ నెల్లూరు నగరంలోని విఆర్సి సెంటర్ వద్ద టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలుసుకున్న 1వ పట్టణ పోలీసులు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరించడం సిగ్గుచేటని, పోలీసు బెదిరింపులకు లొంగక తమ నిరసన వ్యక్తం చేసిన 11 మంది టిఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు కార్యకర్తలపై క్రైమ్ నెంబర్ 349/2019, సెక్షన్లు 341,143,188, ఆర్/డబ్ల్యు 149 క్రింద 1వ పట్టణ ఎస్ ఐ కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో కొడాలి నాని దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలుపగా క్రైమ్ నెంబర్ 342/19, సెక్షన్లు 143,188, 341, 427, ఆర్/డబ్ల్యు 149 క్రింద 1వ పట్టణ పోలీసులు కేసులు నమోదు చేశారని, ఇసుక కొరత పై భవన నిర్మాణ కార్మికులకు అండగా నెల్లూరు రూరల్ ఇంచార్జ్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద శాంతియుతంగా నిరాహారదీక్ష చేపడితే క్రైమ్ నెంబర్ 315/19, సెక్షన్లు 143,341,283, ఆర్/డబ్ల్యు 149 కింద కేసులు నమోదు చేసి పక్ష పాత వైఖరి తో పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి నేతలు కార్యకర్తలు ఆందోళనలు చేస్తే భావప్రకటన స్వేచ్ఛ అంటూ టిఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే వైసిపి ప్రభుత్వ ప్రోత్సాహంతో పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తూ, కార్యక్రమాలను అడ్డుకుంటూ, బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై, ప్రజా సమస్యలపై, వైసిపి మంత్రుల అసభ్యకరమైన వైఖరిపై గళం విప్పితే సరాసరి జైలు కు పంపిస్తా మంటూ బెదిరిస్తూ హిట్లర్, ముస్సోలినీ వంటి నియంతల పాలనను ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేత లు గుర్తుకు తెస్తున్నారని అన్నారు. వైసీపీ నాయకులకు కార్యకర్తలకు ఒక న్యాయం, టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరొక న్యాయం పాటిస్తూ వైసీపీ కార్యకర్తలు గా తొత్తులుగా పోలీసులు వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. వెంటనే టిఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు టిడిపి నాయకులపై పెట్టిన కేసులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, చర్యలు తీసుకోవాలని భావిస్తే పరిధులు దాటి అసభ్యకరమైన రీతిలో దుర్భాషలాడుతూ ప్రత్యక్ష దాడులకు పాల్పడుతున్న వైసీపీ నాయకుల పై మొదట కేసులు నమోదు చేసి ఆపై తమ వద్దకు రావాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ నియంత వైఖరిని, పోలీసుల పక్షపాత ధోరణి వ్యవహారాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నామని, త్వరలోనే ప్రజలు అధికార పార్టీ పై తిరగబడి సమన్యాయం, హక్కులు సాధించుకునేలా, ప్రజా సమస్యలపై ఉద్యమించేలా చైతన్య పరచనున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్రుల్లా, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ చౌదరి, నగర ప్రధాన కార్యదర్శి అఖిల్, టిఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు సాయి తేజ రెడ్డి, హర్ష నాయుడు, రాజ్ కుమార్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

No comments: