రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నెల్లూరు, డిసెంబర్ 18, (రవికిరణాలు): నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 29వ డివిజన్లలోని కేశవుల నగర్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర కమీషనర్ వార్డు సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు గంటలు తరబడి, రోజులు తరబడి వేచి చూడకుండా తక్షణమే పరిష్కార వేదికలుగా వార్డు సచివాలయాలు రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు. వై.యస్. జగన్ మోహన్ రెడ్డి 3648కి.మీ. పాదయాత్రలో ప్రజల కష్టాలను అతి దగ్గర నుంచి చూశారని, ప్రజలకు కష్టాల నుండి విముక్తి కల్పించేందుకు వాలంటీర్ల వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ప్రజల ముందుకు తీసుకువచ్చారని అన్నారు. ప్రజలకు చేరువగా ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా వాలంటీర్లు పనిచేసి, ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా పనిచేయాలన్నారు. ప్రజలకు ఎక్కడా ఏ ఇబ్బంది కలగకుండా, ప్రజలకు జవాబుదారీతనంగా వాలంటీర్లు ఉండాలని సూచించారు.

No comments: