సమస్యలకు సత్వర పరిష్కారం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

సమస్యలకు సత్వర పరిష్కారం

నెల్లూరు, డిసెంబర్‌ 05, (రవికిరణాలు) : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పాతవెల్లంటి గ్రామంలో గురువారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డిలు గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి పదేపదే కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని, ఇకమీదట ఈ పరిస్థితి ప్రజలకు ఉండబోదన్నారు. సమస్యలకు సత్వరమే ఈ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పరిష్కారం దొరుతుందని అన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన ఏకైక ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వై.యస్. జగన్ మోహన్ రెడ్డి సంక్షేమపధకాలను అమలు చేస్తున్నారని, పాదయాత్రలో ఇచ్చిన హామీలలో ఇప్పటికే 95% హామీలు నెరవేర్చారన్నారు. నెల్లూరు జిల్లా కేంద్రసహకార బ్యాంక్ ఛైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా వాలంటీర్లు పనిచేయాలన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా పాలంటీర్లు పనిచేయాలని అన్నారు.
సమస్యలకు సత్వర పరిష్కారం Reviewed by CHANDRA BABU on December 05, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌ 05, (రవికిరణాలు) : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పాతవెల్లంటి గ్రామంలో గురువారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం...

No comments: