ఇస్రో ఖాతాలో మరో విజయం.. పిఎస్‌ఎల్‌వి-సి 48 ప్రయోగం సక్సెస్ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఇస్రో ఖాతాలో మరో విజయం.. పిఎస్‌ఎల్‌వి-సి 48 ప్రయోగం సక్సెస్

శ్రీసిటీ, డిసెంబర్‌11, (రవికిరణాలు) : వరుస ప్రయోగాలతో అంతరిక్షంపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాగిస్తోన్న ఇస్రో మరో మైలురాయిని అందుకుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రిశాట్ ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని ఒకటో లాంఛ్ ప్యాడ్ నుంచి ప్రయోగించింది. ఇప్పటికే పీఎస్ ఎల్వీ సీ 47 ప్రయోగం సక్సెస్ కావడంతో మంచి ఊపుమీదున్న ఇస్రో కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఈ ప్రయోగం చేపట్టారు. శ్రీహరికోట సతీష్​దావన్​స్పేస్ సెంటర్​నుంచి పీఎస్ఎల్వీ-సీ48 నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిరింది.పీఎస్ఎల్వీ-సీ48 సక్సెస్ కావడంపై ఇస్రో ఛైర్మన్ శివన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇస్రో తురుపుముక్క పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ప్రయోగాల్లో ఇది 50వది. ఇప్పటిదాకా 49 పీఎస్ఎల్వీలను అంతరిక్షంలోకి పంపించింది. 23 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియ అనంతరం నింగిలోకి దూసుకెళ్లింది.
ఇస్రో ఖాతాలో మరో విజయం.. పిఎస్‌ఎల్‌వి-సి 48 ప్రయోగం సక్సెస్ Reviewed by CHANDRA BABU on December 11, 2019 Rating: 5 శ్రీసిటీ, డిసెంబర్‌11, (రవికిరణాలు) : వరుస ప్రయోగాలతో అంతరిక్షంపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాగిస్తోన్న ఇస్రో మరో మైలురాయిని అందుకుంది. అత్యం...

No comments: