భూ సమస్యలు, రైతుల సమస్యలపై అధికారులతో గిరిధర్ రెడ్డి సమీక్ష
నెల్లూరు, డిసెంబర్ 17, (రవికిరణాలు) : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కలివెలపాలెం, సామంతులవారితోపు, ఉప్పుటూరు, మాదరాజు గూడూరు, పెనుబర్తి గ్రామాలలోని భూ సమస్యలపై, రైతుల సమస్యలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గ్రామ నాయకులతో కలిసి మంగళవారం ఆర్.డి.ఓ, ఎం.పి.డి.ఓ తో చర్చించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ జగన్ మోహన్ రెడ్డి రైతే రాజు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారని, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని గిరిధర్ రెడ్డి అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, యదనపర్తి వెంకటేశ్వర్లు రెడ్డి, కిషోర్ రెడ్డి, వేణు, వేలూరు శివ, సునీల్ కుమార్ రెడ్డి, ఆళ్ళ మనోహర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, రాధా కృష్ణా రెడ్డి, హరి రెడ్డి, చెంచు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments: