కన్యకల ఆసుపత్రిలో రోగులకు పండ్లు,రొట్టెలు పంపిణీ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

కన్యకల ఆసుపత్రిలో రోగులకు పండ్లు,రొట్టెలు పంపిణీ

నెల్లూరు, డిసెంబర్‌ 17, (రవికిరణాలు) : ప్రీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా|| పి.అనీల్ కుమార్ సూచనల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ సి సెల్ జిల్లా కార్యదర్శి అరవ ఆనంద్ బాబు నెల్లూరు నగరంలోని 51వ డివిజన్ కన్యకల ఆసుపత్రి నందు రోగులకు పండ్లు,రొట్టెలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడుతూ ప్రీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా గత కొన్నేళ్ళుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం జరుగుతోందన్నారు. వైఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అలాగే అనీల్ కుమార్‌కు మంత్రి పదవి రావడం ఈ ఏడాది క్రిస్మస్ కు ఆ భగవంతుడు మాకు బహుమతిగా ఇచ్చినట్లు సంతోషిస్తున్నాము. ఆ దేవుని దయవల్ల వారు, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు ఎ.బాలాప్రసాద్, కాయల సురేష్ బాబు, అరవ విజయ్ బాబు, ఆంథోనిబాబు, కల్పన, అరవ రమేష్, సరిత, ప్రమీల, ఉమా, క్రాంతికుమార్, బోసు, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
కన్యకల ఆసుపత్రిలో రోగులకు పండ్లు,రొట్టెలు పంపిణీ Reviewed by CHANDRA BABU on December 17, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌ 17, (రవికిరణాలు) : ప్రీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా|| పి.అనీల్ కుమార్ సూచనల మేరకు వైఎస్ఆర్...

No comments: