ఏబీవీపీ ఆధ్వర్యంలో భిక్షాటన, ధర్నా
గూడూరు, డిసెంబర్ 12, (రవికిరణాలు) :అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి గూడూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం స్థానిక టవర్ క్లాక్ సెంటర్ వద్ద భిక్షాటన, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిన్న మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత సంవత్సరం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థి జీవితాలతో చెలగాటమాడుతు విద్యార్థులను మోసం చేస్తున్నారని గత ప్రభుత్వం కూడా విద్యార్థులను ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకుండా ఇబ్బంది పెట్టిందని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా కూడా విద్యార్థి సమస్యలు పట్టించుకోని స్కాలర్షిప్ ఇవ్వాలని కోరారు. అనంతరం నగర కార్యదర్శి శ్యామ్ మాట్లాడుతూ ఫీజు రియెంబర్స్మెంట్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక కళాశాలలో ఫీజులు కట్టలేక విద్యార్థులు చదువు మానుకొని పనులకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని విద్యార్థులకు బంగారు భవిష్యత్తు చేస్తామని ప్రభుత్వము ఉట్టి మాటలు పలుకుతూ విద్యార్థి జీవితాలను నాశనం చేస్తుందని ఇప్పటికైనా మేలుకొని బకాయిలను విడుదల చేయాలని వారు కోరారు. లేనిపక్షంలో గత ప్రభుత్వం పట్టిన గతి ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి శ్యామ్, నగర సహాయ కార్యదర్శి హర్షవర్ధన్, ఏబీవీపీ నాయకులు కిరణ్, మహేష్, జార్జ్, ప్రవీణ్ బాబు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

No comments: