నెల్లూరు జిల్లా యస్పిగా బాధ్యతలు స్వీకరించిన భాస్కర్ భూషణ్ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

నెల్లూరు జిల్లా యస్పిగా బాధ్యతలు స్వీకరించిన భాస్కర్ భూషణ్

శాంతి భద్రతలు, నేర నియంత్రణ, నేర పరిశోధన, ట్రాఫిక్ అంశాలపై ప్రధాన దృష్టి
మహిళలు, బాలలు, వృద్ధుల యొక్క భద్రత ఇంకా బలహీన వర్గాల సమస్యలు, పోలీస్ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
మైనింగ్, బెట్టింగ్, ఎర్రచందనం మాఫియాలపై ఉక్కుపాదం మోపుతాం
నెల్లూరు, డిసెంబర్‌ 08, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, నేర పరిశోధనతో పాటు ట్రాఫిక్ అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తానని, అదేవిధంగా మహిళలు, బాలలు, వృద్ధుల యొక్క భద్రత ఇంకా బలహీన వర్గాల సమస్యలు పోలీస్ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లా పోలీసు సిబ్బందితో కలిసి ప్రజల సహకారంతో వారి ఆకాంక్షలకు అనుగుణంగా సేవలు నిర్వహిస్తామని, మైనింగ్, బెట్టింగ్, ఎర్రచందనం మాఫియాలపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా యస్పి తెలిపారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయం నందు జిల్లా యస్పిగా భాస్కర్ భూషణ్ బాధ్యతలు స్వీకరించి మీడియా మిత్రులతో తను 2009 ఐపిఎస్‌ బ్యాచ్ ఆఫీసర్ నని, గత 10 సంవత్సరాలలో కరీంనగర్ జిల్లాలో శిక్షణ తరువాత అడిషనల్ యస్పి హోదాలో కొత్తగూడెంఖమ్మం జిల్లా, బెల్లంపల్లి-ఆదిలాబాద్ జిల్లాతో పాటు యస్పి హోదాలో పశ్చిమగోదావరి జిల్లా, ఇంటలిజెన్స్, డిజిపి ఆఫీస్, మంగళగిరి నందు ఏఐజి(అడ్మిన్)గా సేవలు అందించానని పరిచయ కార్యక్రమం అనంతరం పై వ్యాఖ్యలు చేసారు. ప్రజలలో జిల్లా పోలీసుల ఇమేజ్ మరింత పెంచే విధంగా ఫ్రెండ్లీ పోలీస్ సేవలు అందిస్తామని, నేర నియంత్రణ, నేర పరిశోధనలో మరియు పోలీసు సేవలలో టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తామని తెలిపారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, చట్టాలకు లోబడి అందరూ కూడా పనిచేయవలసి ఉంటుందని ఈ సందర్భంగా యస్పి తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా యస్పితో పాటు అడిషనల్ యస్పి(జైమ్స్)పి.మనోహర్ రావు, అడిషనల్ యస్పి(ఎఆర్)యస్.వీరభద్రుడు, యస్.బి. డియస్పి యన్ కోటా రెడ్డి, డియస్పి నెల్లూరు టౌన్ జె.శ్రీనివాసుల రెడ్డి, నెల్లూరు రూరల్ డియస్పి కె.వి.రాఘవ రెడ్డి, డియస్పి(ఎ.ఆర్) రవీంద్ర రెడ్డి, డియస్పి డి.శ్రీనివాస రావు, టౌన్ యస్.బి. ఇన్స్పెక్టర్ లు, రిజర్వు ఇన్స్పెక్టర్ లు, పోలీస్ అసోసియేషన్ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా యస్పిగా బాధ్యతలు స్వీకరించిన భాస్కర్ భూషణ్ Reviewed by CHANDRA BABU on December 08, 2019 Rating: 5 శాంతి భద్రతలు, నేర నియంత్రణ, నేర పరిశోధన, ట్రాఫిక్ అంశాలపై ప్రధాన దృష్టి మహిళలు, బాలలు, వృద్ధుల యొక్క భద్రత ఇంకా బలహీన వర్గాల సమస్యలు, పోలీస...

No comments: