ఇంటి నివేశ స్థలాల పట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఇంటి నివేశ స్థలాల పట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి

వెంకటాచలం, డిసెంబర్‌ 04, (రవికిరణాలు) : వెంకటాచలం మండల కేంద్రంలో రైతుల స్వాధీనంలో ఉన్న భూములకు అనుభవ హక్కు పత్రాలు, రామదాసు కండ్రిక గ్రామంలో ఇంటి నివేశ ధ్రువీకరణ పత్రాలను వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి బుధవారం పంపిణీ చేశారు.వెంకటాచలం సత్రం భూములపై హక్కు కల్పించాలని చాలా కాలంగా రైతులు అడుగుతున్నా, ఇప్పటికి పరిష్కారం దొరకడం సంతోషంగా ఉంది.వీటికి పట్టాలు ఇవ్వమని గతంలోనే అధికారులకు చెప్పడం జరిగింది.అప్పట్లో పాలకుల నిర్లక్ష్యంగా ఉండడంతో వాటిని పట్టించుకోలేదు. వైయస్సార్సీపీ అధికారంలోకి వస్తే వీటికి పరిష్కారం చూపుతానని చెప్పడం జరిగింది.ఇప్పుడు అధికారులందరూ కష్టపడి,పరిష్కారం చూపడం జరిగింది.త్వరలోనే శాశ్వత పట్టాలు మంజూరు చేసే బాధ్యత నాది.రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం.రైతుల సమస్యలు కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిచాలని అధికారులకు చెప్పడం జరిగింది.మీకు అతి పెద్ద సేవకుడిలాగా నేను ఎల్లవేళలా పని చేస్తా.రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం గత ప్రభుత్వం ఒక్క పైసా నిధులు ఇవ్వని పరిస్థితి.ముఖ్యమంత్రిజగన్మోహన్ రెడ్డి మాత్రం గ్రామాల్లో సౌకర్యాల కోసం నిధులు విడుదల చేశారు.రైతులు సాగు నీరు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ప్రతి
సెంటుకు నీరు అందిస్తామన్నారు. గతంలో కనీస సౌకర్యాలు చేసుకోలేని పరిస్థితి.ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడంతో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడుతున్నామని చెప్పారు.గతంలో మాదిరిగా ఎక్కడా కమీషన్లు ఉండవు.గతంలో చంద్రబాబు, ఆయన కుమారుడు, అందరూ కమీషన్లు దండుకోవడంతో ప్రజలు బుద్ది చెప్పారు. మీరు నన్ను రెండవ సారి గెలిపించినందుకు మీరు గర్వంగా చెప్పుకునే విధంగా అభివృద్ధి చేస్తాను.అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందిస్తాము.ఎన్ని సమస్యలు ఉన్నా ఎప్పుడైనా, నా దృష్టికి తీసుకొని వస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్యాంసుందర్ రెడ్డి,వెెంకటశేషయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇంటి నివేశ స్థలాల పట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి Reviewed by CHANDRA BABU on December 04, 2019 Rating: 5 వెంకటాచలం, డిసెంబర్‌ 04, (రవికిరణాలు) : వెంకటాచలం మండల కేంద్రంలో రైతుల స్వాధీనంలో ఉన్న భూములకు అనుభవ హక్కు పత్రాలు, రామదాసు కండ్రిక గ్రామంల...

No comments: