- కమిషనర్ పివివిస్ మూర్తి
నెల్లూరు, డిసెంబర్11, (రవికిరణాలు) : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు స్థానిక పడారుపల్లి చెరువు పూర్తిగా నిండిపోయి సమీప ప్రాంతాలకు ప్రవాహం వ్యాపించిందని, పూడికతీత పనులతో చెరువు పారుదలను పునరుద్ధరించాలని నగర పాలక సంస్థ కమిషనర్ పివివిస్ మూర్తి అధికారులను ఆదేశించారు. పడారుపల్లి చెరువుకు సమీపంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంలో వరద ప్రవాహానికి గురైన వ్యవసాయ క్షేత్రాలను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు చెరువు నీటి ప్రవాహం సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న సమస్యలను గుర్తించి, అవసరమైన ప్రవాహ మార్గాల్లో పూడికతీత పనులను సత్వరమే చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు.అనంతరం కోటమిట్టలోని వెహికల్ షెడ్ ను పరిశీలించి మరమ్మతులు పూర్తి చేసుకున్న వాహనాలను ఆయా మున్సిపాలిటీలకు వెంటనే తరలించాలని అధికారులను ఆదేశించారు.

No comments: