ఆడపిల్లను రక్షిద్దాం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఆడపిల్లను రక్షిద్దాం

చిత్తూరు, డిసెంబర్‌ 03, (రవికిరణాలు) : ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ఐరాల వైద్యాధికారి డాక్టర్ సృజన తెలిపారు. మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు అంగన్వాడి కార్యకర్తలు లింగ నిర్థారణ చట్టం పై శిక్షణ కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భంలోని స్కానింగ్ ద్వారా ఆడపిల్ల అని తెలిస్తే గర్భస్రావం చేస్తున్నారని ఇది చట్టరీత్యా నేరమని ఇందుకు ప్రోత్సహించిన వారిపైన కూడా మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం జనాభా పరంగా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ శాతం తక్కువగా ఉన్నదని లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే ఈ పరిస్థితి ఉండదన్నారు. గర్భిణీ స్త్రీలకు ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం ద్వారా అందిస్తున్న ప్రోత్సాహక నగదు పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు చెందేలా ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు ఈ వారం మాతృ వందన యోజన వారోత్సవాల సందర్భంగా పూర్తిస్థాయి లబ్ధిదారులకు న్యాయం చేకూర్చాలని తెలిపారు. ఈ సమావేశంలో సీహెచ్ వో సుగుణవతి, పిహెచ్ఎన్ శాంతకుమారి, సిబ్బంది ఈశ్వరయ్య, శ్రీనివాసులు రెడ్డి, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఆడపిల్లను రక్షిద్దాం Reviewed by CHANDRA BABU on December 03, 2019 Rating: 5 చిత్తూరు, డిసెంబర్‌ 03, (రవికిరణాలు) : ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ఐరాల వైద్యాధికారి డాక్టర...

No comments: