గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

గూడూరు, డిసెంబర్‌ 03, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గూడూరు పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గట్టి నిఘా పెంచామని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ , ప్రయివేటు మహిళా కళాశాలలు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఈవ్ టీజింగ్ వంటి నేరాలకు పాల్పడకుండా విద్యార్థినిలకు రక్షణచర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో అనుమానాస్పదంగా ఎవరైనా సంచరించినా , బహిరంగంగా మద్యం సేవిస్తున్నా , ఏదేని సమస్య తలెత్తినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నేరాల నియంత్రణకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఈ సమావేశంలో డీఎస్పీ భవానిహర్ష , రూరల్ సీఐ రామకృష్ణారెడ్డి , రూరల్ ఎస్ఐ పుల్లారావు,తదితరులు పాల్గొన్నారు.
గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ Reviewed by CHANDRA BABU on December 03, 2019 Rating: 5 గూడూరు, డిసెంబర్‌ 03, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చ...

No comments: