అమర జీవులైన పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర అందరికి ఆదర్శనీయం - జిల్లా కలెక్టరు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

అమర జీవులైన పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర అందరికి ఆదర్శనీయం - జిల్లా కలెక్టరు

నెల్లూరు, డిసెంబర్‌ 15, (రవికిరణాలు) : భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి అవిరళ కృషి చేసి అమర జీవులైన పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర అందరికి ఆదర్శనీయమని జిల్లా కలెక్టరు ఎమ్.వి.శేషగిరిబాబు పేర్కొన్నారు.ఆదివారం స్థానిక వెంకటేశ్వర కస్తూర్బా కళా క్షేత్రంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 67వ వర్థంతి వార్షిక్షత్సోవాలను జిల్లా కలెక్టరు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు స్వాతంత్రోద్యమంలో ఉప్పుసత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం లాంటి మహోన్నతమైన ఉద్యమాలలో పాల్గొని చివరకు నెల్లూరు జిల్లాలో స్థిరపడ్డారన్నారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి కృషి చేసి అమరజీవులైన పొట్టి శ్రీరాములు వర్ధంతి ఉత్సవాలను ఈ రోజు జరుపుకోవడం ఆనందంగా వుందన్నారు. విద్యాలయలవారు పొట్టి శ్రీరాములు జీవతానికి సంబంధించిన విశేషాలను సమాకూర్చితే వాటిని భద్రపరచి మ్యాజియంలో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇది భావితరాల వారికి పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర తెలియజేయడానికి ఉపయోగ పడుతుందని, చిన్నారులందరు వారి అడుగుజాడలలో నడిచి ధన్యులు కావాలని కోరుకుంటున్నామన్నారు.అనంతరం జిల్లా పోలీసు అధికారి భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం దళితుల అభ్యున్నతి కొరకు పొరాడి ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు ఎంతో గొప్పవారని వారి జీవితం భావితరాలకు ఆదర్శం కావాలన్నారు.తదుపరి సంయుక్త కలెక్టరు డా. వి.వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం, భాష కోసం పోరాడి వారి ప్రాణాలను త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జన్మించిన రాష్ట్రంలో వున్నందుకు నేనెంతో గర్వపడుతున్నానన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామకార్యదర్శులు, గ్రామ వాలంటీర్లు పనిచేయాలని కోరుకుంటున్నానన్నారు.అనంతరం వాత్సల్య సంస్థ వారి చే కోలాట ప్రదర్శన, జిల్లా పరిషత్ హైస్కూలు, దర్గామిట్ట, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం తడ, కావలి విద్యార్థినులు, గిరిజన సంక్షేమ విద్యార్థి నుంచి ఏర్పాటు చేయబడిన సాంస్కృతిక కార్యక్రమాలు (నాట్య ప్రదర్శనలు) ఆహుతులను ఎంతో అలరించాయి.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.మల్లిఖార్జున, నుడా వైస్ చైర్మెన్ బాపి రెడ్డి, రెవెన్యూ డివిజనల్
అధికారి హుస్సేన్ సాహెబ్, పొట్టి శ్రీరాములు సమకాలీనులు చలమయ్య తదితరులు పాల్గొన్నారు.
అమర జీవులైన పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర అందరికి ఆదర్శనీయం - జిల్లా కలెక్టరు Reviewed by CHANDRA BABU on December 15, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌ 15, (రవికిరణాలు) : భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి అవిరళ కృషి చేసి అమర జీవులైన పొట్టి శ్రీరాములు జీవిత చర...

No comments: