అంబేద్కర్ సేవా పురస్కారాన్ని అందుకున్న అపోలో ఉద్యోగి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

అంబేద్కర్ సేవా పురస్కారాన్ని అందుకున్న అపోలో ఉద్యోగి

నెల్లూరు, డిసెంబర్ 10, (రవికిరణాలు) : నెల్లూరు అపోలో హాస్పిటల్ ఉద్యోగి మద్దినేని నితిన్ శివకుమార్ అంబేద్కర్ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. మంగళవారం నెల్లూరులోని ఆంధ్రసభ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో సంఘం ఛైర్మైన్ ఎమ్. సుబ్బారెడ్డి, నెల్లూరు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ చైత్ర వర్షిణి, అనంతపురం డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సేవారంగాలలో సేవలందించిన 150మందికి అంబేద్కర్‌ సేవా పురస్కారాలను అందజేశారు.గత కొన్నేళ్లుగా వైద్య రంగంలో మద్దినేని నితిన్ శివకుమార్ అందిస్తున్న సేవలకు గాను ఈ రోజు అంబేద్కర్‌ సేవా పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్‌ యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది ఆయనను అభినంధించారు.
అంబేద్కర్ సేవా పురస్కారాన్ని అందుకున్న అపోలో ఉద్యోగి Reviewed by CHANDRA BABU on December 10, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్ 10, (రవికిరణాలు) : నెల్లూరు అపోలో హాస్పిటల్ ఉద్యోగి మద్దినేని నితిన్ శివకుమార్ అంబేద్కర్ సేవా పురస్కారాన్ని అందుకున్నారు...

No comments: