బహిరంగ మద్యసేవనంపై నెల్లూరు పోలీసుల స్పెషల్ డ్రైవ్ లు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

బహిరంగ మద్యసేవనంపై నెల్లూరు పోలీసుల స్పెషల్ డ్రైవ్ లు

నెల్లూరు, డిసెంబర్‌ 04, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై జిల్లా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహిస్తూ ఉక్కుపాదం మోపుతున్నారు. నిర్మానుష్య ప్రాంతాలు, టౌన్ లు, రైల్వే స్టేషన్ ల శివారు ప్రాంతాలు, బస్ స్టాండ్ ప్రాంగణాలు, వంతెనలు, కల్వర్టులు, వివిక్త, అటవీ ప్రాంతాలు, పార్కులు, రహదారులు ప్రక్కన మరియు పాడుబడిన భవనాలలో అసాంఘిక కార్యక్రమాలు అరికట్టేదిశలో మహిళలు దంపతులు, బాలలు, బాటసారులు మొదలగు వారిపై ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, వాహనాలను ఆపి వాహనాలు బహిరంగంగా రహదారులపై కూర్చుని మద్యం సేవిస్తూ, బెదిరింపులకు, ఆకతాయి చర్యలకు పాల్పడే సందర్భాలే కాకుండా లైంగిక దాడులు జరిపే అవకాశాలు ఉన్నందున, అటువంటి వారిపై కఠినంగా వ్యవరించి, వారి వాహనాలు జప్తు చేయవలసిందిగా జిల్లా యస్పి ఐశ్వర్య రాస్తోగి పోలీసు అధికారులు అందరికీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్, సర్కిల్ పరిధిలలో ఎస్‌హెచ్‌ఓ లు సర్కిల్ ఇన్స్పెక్టర్ లు మస్తీ దుస్తులలో ప్రత్యేక టీంలు ఫాం చేసుకొని బహిరంగ మద్యం సేవనం చేసే వారిపై దాడులు నిర్వహిస్తూ విరివిగా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ప్రజలు భాద్యతాయుతంగా వ్యవహరిస్తూ ఇంకా ఇలాంటి వ్యక్తులపై మరియు అసాంఘిక కార్యకలాపాలు జరిపే వారిపై పోలీసులు సమాచారం అందించాల్సిందిగా కోరడమైనది.నెల్లూరు జిల్లాలో జూన్ నుండి నవంబరు వరకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 3,107 మంది వ్యక్తుల పై 1,888 కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచడం జరిగింది. ఇందులో ఒక్క నవంబర్ నెలలోనే 554 కేసులను 191 మంది బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వ్యక్తులపై నమోదు చేయడం జరిగింది. అయితే పోలీసులకు సమాచారం సకాలంలో పంపితే ప్రజల మద్దతుతో ఇంకా ఎక్కువ సంఖ్యలో కేసులను బుక్ చేసే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేయడమైనది. పౌరులు, బహిరంగ ప్రదేశంలో లేదా ఏ ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి బహిరంగ మద్యపానం గురించి సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ డయల్ 100 ద్వారా గానీ లేదా వాట్సాప్‌ నెంబర్‌ 9390777727 ద్వారా గానీ అందించిన వెంటనే స్థానిక పోలీసులు వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపడం జరుగుతుందని, అదేవిధంగా సమాచారం ఇచ్చేవారి వివరాలు ఎట్టిపరిస్థితులలో బహిర్గతం చేయబడవని జిల్లా యస్పి ఈ సందర్భంగా తెలియజేసారు.
బహిరంగ మద్యసేవనంపై నెల్లూరు పోలీసుల స్పెషల్ డ్రైవ్ లు Reviewed by CHANDRA BABU on December 04, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌ 04, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై జిల్లా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ లు నిర్వ...

No comments: