నెల్లూరు, డిసెంబర్ 19, (రవికిరణాలు) : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్, యన్.జి.ఓ. కాలనీలో నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, విజయడైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగా రెడ్డి వార్డు సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, ఇంతకు ముందు సమస్యల పరిష్కారానికి పదేపదే కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని, ఇకమీదట ఆ పరిస్థితి ప్రజలకు ఉండబోదన్నారు. సమస్యలకు సత్వరమే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పరిష్కారం దొరుకుతుందని అన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన ఏకైక ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డిని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వై.యస్.జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, పాదయాత్రలో ఇచ్చిన హామీలలో ఇప్పటికే 95శాతం హామీలు నెరవేర్చారన్నారు. 22వ డివిజన్ లో త్వరలో కోటి ఇరవై ఏడు లక్షల రూపాయిలతో పనులను ప్రారంభించనున్నామని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా వాలంటీర్లు ఈ ఉండాలని, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా వాలంటీర్లు పనిచేయాలని అన్నారు.

No comments: