“అమరజీవి”కి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించిన జిల్లా యస్పి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

“అమరజీవి”కి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించిన జిల్లా యస్పి

పొట్టిశ్రీరాములు స్మృతులు, సేవలను స్మరించుకున్న జిల్లా పోలీసు అధికారులు
నెల్లూరు, డిసెంబర్‌ 15, (రవికిరణాలు) : అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు బస్టాండ్ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ ఘనంగా నివాళులు అర్పించారు. పొట్టి శ్రీరాములు తన ఆశయసాధనలో కరోర నిర్ణయంతో 56 రోజులు దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడని, అందుకే గొప్ప వ్యక్తిని స్మరించుకోవడం తెలుగువారు మరియు ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రజలు గర్వించదగ్గ విషయం అని ఈ సందర్భంగా జిల్లా యస్పి తెలిపారు. అనంతరం కస్తూర్బా కళాక్షేత్రంలో ఏర్పాటు చేయబడిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలలో జిల్లా యస్పి పాల్గొనడం జరిగినది. అనంతరం 11 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయం నందు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి, జిల్లా పోలీసు అధికారులతో కలిసి శ్రాద్ధంజలి ఘటించారు. అనంతరం జిల్లా యస్పి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి అమర జీవి అయిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు, ఆంధ్ర రాష్ట్ర అవతరణతో పాటు భారతదేశంలో బాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడయినాడని, హరిజనుల ఉద్దరణ, స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పాత్ర అమోఘం అని జిల్లా యస్పి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్.పి. (ఏ.ఆర్) యస్.వీరభద్రుడు, అడిషనల్ యస్పి(కైమ్స్)పి.మనోహర్ రావు, యస్.బి. డియస్పి యన్.కోటారెడ్డి, డియస్పి(ఏ.ఆర్) వై.రవీంద్ర రెడ్డి, డియస్పి(హెచ్‌జి) డి.శ్రీనివాస రావు, ఆర్.ఐ. లు మౌలుద్దీన్, రమణయ్య, దర్గామిట్ట ఇన్స్పెక్టర్ యం.నాగేశ్వరమ్మ, డి.సి.ఆర్.బి. సి.ఐ. రామారావు, ఆర్.యస్.ఐ. లు ఇతర సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు.
“అమరజీవి”కి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించిన జిల్లా యస్పి Reviewed by CHANDRA BABU on December 15, 2019 Rating: 5 పొట్టిశ్రీరాములు స్మృతులు, సేవలను స్మరించుకున్న జిల్లా పోలీసు అధికారులు నెల్లూరు, డిసెంబర్‌ 15, (రవికిరణాలు) : అమరజీవి పొట్టి శ్రీరాములు వర...

No comments: