రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

నెల్లూరు, డిసెంబర్‌ 17, (రవికిరణాలు) : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 33వ డివిజన్లలోని డైకస్ రోడ్డు సెంటర్ నందు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 4 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ మా సోదరుడు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం 33 డివిజన్ అభివృద్ధి 1 కోట్ల 50 లక్షలతో ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా సోదరుడు ఈ ప్రాంత అభివృద్ధికి తన శక్తిమేర కృషి చేశారని చెప్పారు. కష్టకాలంలో తమతో వెన్నంటి నడచిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం ఎప్పుడూ ఉంటాయన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పధకాలు అందే విధంగా కృషి చేస్తామని అన్నారు. అనంతరం 33వ డివిజన్ ఇన్ ఛార్జ్ మేఘనాథ్ సింగ్ మన ఇంటికి మన డివిజన్ ఇన్ ఛార్జ్ కార్యక్రమాన్ని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ప్రజల గుండె చప్పుడు అనుగుణంగా డివిజన్ ఇన్‌ఛార్జులు పనిచేయాలని సూచించారు.
రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి Reviewed by CHANDRA BABU on December 17, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌ 17, (రవికిరణాలు) : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 33వ డివిజన్లలోని డైకస్ రోడ్డు సెంటర్ నందు నెల్లూరు రూరల్ ఎమ్మెల్...

No comments: