రూ.7కోట్లతో పొట్టేపాళెం కలుజుపై హైలెవల్ బ్రిడ్జి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

రూ.7కోట్లతో పొట్టేపాళెం కలుజుపై హైలెవల్ బ్రిడ్జి

నెల్లూరు, డిసెంబర్‌ 06, (రవికిరణాలు) : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాళెంలోని కలుజును అధికారులతో కలసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ వర్షాలు పడినప్పుడు ఈ కలుజు వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ ప్రాంతం మీద బుచ్చి ప్రముఖ పుణ్యక్షేత్రాలైన నరసింహకొండ, జొన్నవాడ దేవస్థానాలకి వెళ్తుంటారని, అలాంటి ఈ రహదారి చాలా అద్వాన్నాంగా, గుంటలు మిట్టలుగా ఉందని, వర్షాలు పడితే ఈ రహదారి గుండా వెళ్ళే పరిస్థితి కూడా లేదన్నారు. ఈ కలుజు శాశ్వత పరిష్కారానికి మంత్రి అనీల్ కుమార్ యాదవ్ మరియు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల దృష్టికి అధికారులు తీసుకుపోయారని, 7 కోట్ల రూపాయలతో హైలెవల్ బ్రిడ్జికి ప్రతిపాధనలు పంపారని, మరొ రెండు మూడు నెలలో ప్రతిపాధనలు మంజూరై టెండర్లు ప్రక్రియ కూడా పూర్తవుతుందన్నారు. శాశ్వత పరిష్కారం కోసం ఎదురు చూడకుండా తాత్కాలికంగా ఈ రోడ్డుకు యుద్ధప్రాతిపధికన మరమత్తులు చేయాలని అధికారులకు రూరల్ ఎమ్.ఎల్.ఎ. కార్యాలయం ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సూచించారు.
రూ.7కోట్లతో పొట్టేపాళెం కలుజుపై హైలెవల్ బ్రిడ్జి Reviewed by CHANDRA BABU on December 06, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌ 06, (రవికిరణాలు) : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాళెంలోని కలుజును అధికారులతో కలసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే...

No comments: