నెల్లూరు, డిసెంబర్ 02, (రవికిరణాలు) : వెంకటాచలం మండల కేంద్రంలో జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్బంగా పర్యావరణ పరిరక్షణ చైతన్యతా ర్యాలీని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.ప్లాస్టిక్ వస్తువుల వాడక నిషేధంపై ప్రతిజ్ఞ చేయించి, గుడ్డ సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించుకోవాలి.పర్యావరణం పరిరక్షించుకునేందుకు ప్లాస్టిక్ సంచులను నిషేధించి, గుడ్డ సంచులను వాడాలి.జిల్లా థర్మల్ విద్యుత్ కేంద్రాల వల్ల కాలుష్యం కోరలు వెెదజల్లడంతో ప్రజలు యిబ్బందులు పడుతున్నారు., వీలైనంత వరకు చెట్లు పెంచి పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి.పిల్లలు కేవలం చదువులకే పరిమితం కాకుండా, సామాజిక అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి పాటుపడాలి.పిల్లలందరూ స్వేచ్ఛ, స్వాతంత్య్రంగా వ్యవహరించడంతో పాటు జాగ్రత్తగా ప్రవర్తించాలి.ఇటీవల జరిగిన “దిశ” ప్రియాంక రెడ్డి ఘటన సభ్యసమాజానికి తలవంపులు తెచ్చిపెట్టింది.సమాజంలో మానవ మృగాలకు తావులేకుండా, కఠిన చట్టాల ద్వారా నిర్మూలించాలి.పిల్లలకు అవసరమైన చదువు సంధ్యలతో పాటు, క్రమశిక్షణను అలవరుచుకుని సంస్కృతి సంప్రదాయాలతో సమాజంలో మెలగాలి.పర్యావరణ పరిరక్షణను
అందరూ బాధ్యతగా భావించాలి.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్లాస్టిక్ నిషేధానికి పిలుపునివ్వడం జరిగింది.ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులకు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు, ప్రజలకు, అధికారులకు, అభినందనలు తెలిపారు.
అందరూ బాధ్యతగా భావించాలి.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్లాస్టిక్ నిషేధానికి పిలుపునివ్వడం జరిగింది.ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులకు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు, ప్రజలకు, అధికారులకు, అభినందనలు తెలిపారు.
No comments: