- కమిషనర్ పివివిస్ మూర్తి
నెల్లూరు, డిసెంబర్ 02, (రవికిరణాలు) : నగర పాలక సంస్థ పారిశుద్ధ్య విభాగంలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల ఉద్యోగ భద్రత, జీతాల పెంపు తదితర డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కమిషనర్ పివివిస్ మూర్తి తెలిపారు. సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగంలో ప్రజలనుంచి ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలతో రూపొందించిన స్పందన కార్యక్రమం, ప్రజాసమస్యల పరిష్కారవేదికగా నిలిచిందని పేర్కొన్నారు. నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని సమస్యలకు సత్వరమే స్పందిస్తూ ఇప్పటివరకు 98% ఫిర్యాదులను విజయవంతంగా పరిష్కారించామని వెల్లడించారు. కార్పొరేషన్ లోని అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత పాటిస్తున్నామని కమిషనర్ చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు, డిమాండ్లను పరిశీలించి న్యాయమైన నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ వివరించారు.

No comments: