వైకాపాలో చేరిన ప్రతి నాయకునికి సముచిత స్థానం ఉంటుంది - రూరల్‌ ఎమ్మెల్యే - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

వైకాపాలో చేరిన ప్రతి నాయకునికి సముచిత స్థానం ఉంటుంది - రూరల్‌ ఎమ్మెల్యే

నెల్లూరు, డిసెంబర్‌ 02, (రవికిరణాలు) : సోమవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో యువ నాయకుడు ముసునూరు వినోద్ కుమార్, వీరి మిత్రబృందంతో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా రూరల్ లో పెద్ద ఎత్తున పార్టీలోకి చేరికలు వచ్చాయన్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడకుండా, ప్రేమతో అందరినీ కలుపుకుపోతున్నానని, ద్వేషించే వాళ్ళను సైతం ప్రేమిస్తే, ఆ ప్రేమ ద్వారా ఎంతో కొంత లబ్ది పొందవచ్చన్నారు. నెల్లూరు రూరల్ లో అన్ని పార్టీ నాయకులను వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని, నెల్లూరు రూరల్ లో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి గౌరవం కల్పిస్తామన్నారు. కార్యకర్తల, నాయకుల కష్టాలను స్వయంగా అనుభవించానన్నారు. వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. కార్యకర్తలు, నాయకులు బాగుంటేనే పార్టీకి మనుగడ ఉంటుందన్నారు. వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో ఉన్న ప్రతి ఒక్కరి ఋణం తీర్చుకుంటానన్నారు. ప్రతిఒక్కరం కలసిమెలసి రూరల్ నియోజకవర్గాని అభివృద్ధిపధంలో నడిపిస్తామన్నారు. త్వరలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు రూరల్ లో 100కి 100 శాతం అన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వర రావు, పచ్చా రవి, చంద్రమోహన్ రెడ్డి, జల్లి కుమార్, నారాయణ,గోపాలయ్య, ప్రసాద్, ప్రవీణ్, వంశి, కిషోర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
వైకాపాలో చేరిన ప్రతి నాయకునికి సముచిత స్థానం ఉంటుంది - రూరల్‌ ఎమ్మెల్యే Reviewed by CHANDRA BABU on December 02, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌ 02, (రవికిరణాలు) : సోమవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో యువ ...

No comments: