కలెక్టరేట్‌లో ఆలిండియా దళిత్ రైట్స్ ఫోరం ధర్నా - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

కలెక్టరేట్‌లో ఆలిండియా దళిత్ రైట్స్ ఫోరం ధర్నా

నెల్లూరు, డిసెంబర్‌ 02, (రవికిరణాలు) : ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫోరం రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు సోమవారం సి.ఎం.జగన్మోహన్ రెడ్డి గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయానికి ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు తప్పనిసరిగా ఇంగ్లీషు మీడియంలో విద్యకు మద్దతుగాను వ్యతిరేకులకు వ్యతిరేకంగా ధర్నాను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రపంచంలో జీవనభృతిని కల్పించే ఇంగ్లీషు చదువునుఖచ్చితంగా అమలు చేయాలన్నారు. పేదల ఇంగ్లీష్ చదువును కుట్రతో అడ్డగించే ఉపాధ్యాయ సంఘాలు, వ్యతిరేకించే ఇతర సంఘాల యొక్క గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. సంఘ నాయకులకున్న జీతంతో కూడిన ఓ.డి.లన్నింటిని రద్దుచేయాలని, లేదా ఎస్.సి., ఎస్.టి., బి.సి.సంఘాలన్నింటికి ఓ.డి. సదుపాయాలను కల్పించాలని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగ జీవన భృతిని కల్పించే ఇంగ్లీషు మీడియం విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో జి.ఓ. నెం.81రు ద్వారా ప్రవేశ పెట్టిన సి.ఎం. జగన్ చరిత్రలో నిలిచిపోయే గొప్పవ్యకి. సిఎం నిర్ణయాన్ని మంత్రి ఎ.సురేష్, ప్రభుత్వ విద్యాశాఖ సలహాదారు ఎ.మురళీ, ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖరర్లు పేదలకు ఇంగ్లీషు మీడియం విద్యను తప్పనిసరి చేసినందుకు ఏ.ఐ.డి.ఆర్.ఎఫ్ (ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫోరం) తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పేద విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం చదువును వ్యతిరేకించే ఏ పార్టీ లేదా ఉపాధ్యాయ సంఘాలు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం లేదని ఉపాధ్యాయ సంఘాలు వీరి యం.ఎల్.సి. అభ్యర్ధులకు ఓటు బ్యాంకు నష్టపోతుంది కనుక కుట్రతో బూటకపు తెలుగు ప్రేమికులుగా నాటకాలుడుతూ మహోన్నతమైన నిర్ణయం తీసుకొన్న సి.ఎం. జగన్ మంచి నిర్ణయాన్ని రాజకీయ దుర్భుద్ధితో వ్యతిరేకించడము చాలా నీచమైన చర్యగా భావిస్తున్నామని తెలియజేశారు.
కలెక్టరేట్‌లో ఆలిండియా దళిత్ రైట్స్ ఫోరం ధర్నా Reviewed by CHANDRA BABU on December 01, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌ 02, (రవికిరణాలు) : ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫోరం రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు సోమవారం సి.ఎం.జగన్మోహన్ రెడ్డి గొప్ప చారిత...

No comments: