రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన జిల్లా హోమ్ గార్డు యూనిట్ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన జిల్లా హోమ్ గార్డు యూనిట్

నెల్లూరు, డిసెంబర్‌ 04, (రవికిరణాలు) : సమాజంలో అన్ని దానాలలో కెల్లా రక్త దానం, నేత్ర దానాలు ఉత్తమమైనవని, ముఖ్యంగా రక్త దానం ప్రాణదానంతో సమానమని, 57th హోమ్ గార్డ్ రైజింగ్ డే పురస్కరించుకుని బుధవారం జిల్లా నందు పనిచేసే హోం గార్డ్ యూనిట్ డియస్పి డి.శ్రీనివాస రావు ఆద్వర్యంలో ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పాటు చేసిన మెగా రక్త దాన శిబిరాన్ని నెల్లూరు జిల్లా యస్పి ఐశ్వర్య రస్తోగి సందర్శించి పై వ్యాఖ్యలు చేసారు. హెడ్ క్వార్టర్ లో రక్తదానం ఏర్పాటు చేసిన హోం గార్డు డియస్పిని, రిజర్వు ఇన్స్పెక్టర్ వెంకట రమణ, హోం గార్డు అసోసియేషన్ సభ్యులను, సిబ్బందిని, జిజిహెచ్‌, నెల్లూరు డాక్టర్ కె.సింధూజా వారి బృందాన్ని జిల్లా యస్పి అభినందించారు.ఈ సందర్భంగా హోం గార్డు యూనిట్ డియస్పి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో మొత్తం 762 మంది హోం గార్డులు లా అండ్‌ ఆర్డర్, ట్రాఫిక్ లాంటి ప్రధాన విభాగాలతో పాటు సిఐడి, ఏసిబి, ఆర్టివో ఇంటలిజెన్స్, విఅండ్‌ఇ, ట్రాన్స్ కో, ఏపి జెన్కో, జైలు, పైర్, ఎఫ్‌సిఐ మొదలగు విభాగాలో కూడా సేవలు అందిస్తున్నారని ఈ రోజు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నెల్లూరు వారి సహకారంతో జరిగిన మెగా రక్త దాన శిబిరంలో మొత్తం 50 మంది సిబ్బంది రక్త దానం చేసారని తేది. 06.12.2019 న ఉదయం 08.00 గంటలకు జరగబోయే హోం గార్డుల వ్యవస్థాపక దినోత్సవ వేడుకల పైనల్ పెరేడ్ కు జిల్లా యస్పి ఐశ్వర్య రస్తోగిని ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యస్.పి. గారితో పాటు అడిషనల్ యస్.పి.(ఎ.ఆర్.) యస్.వీరభద్రుడు, డియస్పి(హెచ్‌జి యూనిట్) డి.శ్రీనివాస రావు, డియస్పి నెల్లూరు టౌన్ జె.శ్రీనివాసుల రెడ్డి, ట్రాఫిక్ డియస్పి పి.మల్లికార్జున రావు, రిజర్వు ఇన్స్పెక్టర్ వెంకట రమణ, హోం గార్డు అసోసియేషన్ సభ్యులు రవిబాబు,వై.సామ్సన్, బి.రామారావు, శ్రావణ్ కుమార్, శ్రీనివాసులు, రమణమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.
రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన జిల్లా హోమ్ గార్డు యూనిట్ Reviewed by CHANDRA BABU on December 04, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌ 04, (రవికిరణాలు) : సమాజంలో అన్ని దానాలలో కెల్లా రక్త దానం, నేత్ర దానాలు ఉత్తమమైనవని, ముఖ్యంగా రక్త దానం ప్రాణదానంతో సమా...

No comments: