బాబు సంతకానికి భలే డిమాండ్ ! - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

బాబు సంతకానికి భలే డిమాండ్ !

ఢిల్లీలో చంద్రబాబు చక్రం మళ్ళీ గిర్రున తిరగడం మొదలైంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏలో మొత్తం 47 పార్టీల ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ.. చంద్రబాబు పాత్రకుండే ప్రత్యేకతే వేరు. 18 సీట్లున్న శివసేన.. బీజేపీ తర్వాత ఎన్డీఏలో అతిపెద్ద పార్టనర్ అయితే, 16 ఎంపీ సీట్లతో తెలుగుదేశం సెకండ్ ప్లేస్ లో వుంది. పైగా.. చంద్రబాబుకుండే రాజకీయ అనుభవం కూడా చిన్నదేమీ కాదు. ఈ నేపథ్యంలోనే బాబు మీద మోదీ స్పెషల్ అటెన్షన్ వుంచుతున్నారా?
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ ని గెలిపించడం కోసం చంద్రబాబు సాయం కోరారు ప్రధాని మోదీ. మొండిఘటం మమతా బెనర్జీని ఒప్పించి మద్దతునిప్పించాల్సిన బాధ్యతను కూడా బాబు భుజాలమీదే వేసింది బీజేపీ హైకమాండ్. ఎన్డీఏలో బాబు ప్రయారిటీ లెవెల్స్ ఇక్కడితోనే ఆగిపోలేదు. రామ్ నాధ్ కోవింద్ తరఫున నామినేషన్ ప్రతాలు దాఖలు చేస్తున్నది కూడా చంద్రబాబే. ఈ నెల 23న మొత్తం నాలుగు నామినేషన్‌ పత్రాలను కోవింద్‌ దాఖలు చేస్తారు. మొదటి సెట్‌ నామినేషన్లపై ప్రధాని మోదీ సంతకం చేస్తారు.

రెండవ సెట్ పై సంతకం చేసే అవకాశం ఏపీ సీఎం చంద్రబాబుకే దక్కింది. ఆతర్వాత మూడో సెట్‌పై అమిత్‌షా, నాలుగో సెట్‌పై పంజాబ్‌ మాజీ సీఎం ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ సంతకాలు చేస్తారు. సో.. 'రాష్ట్రపతి ఎన్నికలో నాదే కీలక పాత్ర' అంటూ రేపటిరోజున చంద్రబాబు చెప్పుకోడానికి ఒక అవకాశం దొరికినట్లేగా!
బాబు సంతకానికి భలే డిమాండ్ ! Reviewed by CHANDRA BABU on June 21, 2017 Rating: 5 ఢిల్లీలో చంద్రబాబు చక్రం మళ్ళీ గిర్రున తిరగడం మొదలైంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏలో మొత్తం 47 పార్టీల ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ.. చంద్...

No comments: