ఎట్టకేలకు రిటైర్డ్ జస్టీస్ కర్ణన్ అరెస్టు : బెయిల్ కుదరదన్న సుప్రీంకోర్టు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఎట్టకేలకు రిటైర్డ్ జస్టీస్ కర్ణన్ అరెస్టు : బెయిల్ కుదరదన్న సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ కర్ణన్‌ను కోల్‌కతా నగర పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. గత నెలన్నర రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయనను మంగళవారం రాత్రి కోయంబత్తూరులో అరెస్టు చేశారు.
ఆ తర్వాత ఆయన బుధవారం పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన నేపథ్యంలో కర్ణన్‌‍ను బుధవారం జైలుకు తరలించనున్నారు. దేశ న్యాయవ్యవస్థపై ఎంతమాత్రమూ నమ్మకం లేకుండా పారిపోయిన ఆయనపై దయ చూపించాల్సిన అవసరం ఏంటని ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించారు.
కాగా, సుప్రీంకోర్టుకు ఎదురు నిలిచి, న్యాయమూర్తులకు సమన్లు పంపి, వారికి జైలు శిక్ష విధిస్తున్నట్టు చెప్పి, ఆపై కోల్‌కతా నుంచి తమిళనాడుకు పారిపోయిన కర్ణన్, దేశ చరిత్రలో అజ్ఞాతంలో ఉండి పదవీ విరమణ చేసిన తొలి న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
ఎట్టకేలకు రిటైర్డ్ జస్టీస్ కర్ణన్ అరెస్టు : బెయిల్ కుదరదన్న సుప్రీంకోర్టు Reviewed by CHANDRA BABU on June 21, 2017 Rating: 5 సుప్రీంకోర్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ కర్ణన్‌ను కోల్‌కతా నగర పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. గ...
Newer Post
Previous
This is the last post

No comments: