మళ్లీ హాలీవుడ్ లో.. - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

మళ్లీ హాలీవుడ్ లో..

ప్రియాంక చోప్రా...బాలీవుడ్ నటి..పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక హాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది. అక్కడ 'క్వాంటికో' అనే సీరియల్ తో పాటు 'బేవాచ్' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో హాలీవుడ్ చిత్రంలో నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. సిలాస్ హోవర్డ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎ కిడ్ లైక్ జేక్' చిత్రంలో 'ప్రియాంక' కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. 'హోవార్డ్ 'ట్రాన్స్‌పరెంట్‌' సిరీస్‌ చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 'ది బిగ్‌ థియరీ' నటుడు జిమ్‌ పారిసన్‌, క్లారీ డేన్స్‌, ఒక్టావియా స్పెన్సర్‌ లాంటి ప్రముఖ హలీవుడ్‌ నటులతో కలిసి ప్రియాంక నటించనుందని టాక్. తాజాగా 'ప్రియాంక' ఓ ఫొటోను పోస్టు చేసింది. టాంజరిన్ డ్రెస్ తో కనపిస్తున్న ఈ పిక్ 'ఎ కిడ్ లైక్ జేక్' లోనిదేనని ప్రచారం జరుగుతోంది.
మళ్లీ హాలీవుడ్ లో.. Reviewed by CHANDRA BABU on June 21, 2017 Rating: 5 ప్రియాంక చోప్రా...బాలీవుడ్ నటి..పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక హాలీవుడ్ లో కూడా అడుగు పెట్టిం...

No comments: