నందమూరి ఫ్యాన్స్‌కు పండుగల్లాంటి వార్త.. జైలవకుశ గురించి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

నందమూరి ఫ్యాన్స్‌కు పండుగల్లాంటి వార్త.. జైలవకుశ గురించి

జనతా గ్యారేజ్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం జై లవకుశ. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో తొలిసారి జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయడం విశేషం. ఈ ప్రాజెక్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. గతనెల విడుదలైన ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
నందమూరి అభిమానుల నుంచి విశేష స్పందన వస్తుండటంతో తారక్ టీజర్ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి తారక్ సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టీజర్‌ను జూలై తొలివారంలో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. అయితే తేదీ ఇంకా ఖారారు చేయనట్టు సమాచారం. ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేత థామస్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
నందమూరి ఫ్యాన్స్‌కు పండుగల్లాంటి వార్త.. జైలవకుశ గురించి Reviewed by CHANDRA BABU on June 21, 2017 Rating: 5 జనతా గ్యారేజ్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం జై లవకుశ. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో తొలిసారి జూనియర్ ఎన్టీఆ...

No comments: