రవికిరణాలు(శ్రీసిటి రిపోర్టర్ - వెంకట్‌కుమార) : ఇరుగుళం ప్రభుత్వ హైస్కూల్, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు, సోమవారం శ్రీసిటీలోని జపాన్ పరిశ్రమల ప్రతినిధులు లక్ష రూపాయల విలువైన విద్యాసామాగ్రిని వితరణగా అందచేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా శ్రీసిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జపాన్ బృందం వితరణకు ముందుకొచ్చారు. హైస్కూల్ విద్యార్థులు 350 మందికి జామెంట్రీ బాక్సులు, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 140 మందికి బ్యాగులు పంపిణి చేశారు. ప్రాథమిక పాఠశాలకు గ్రంధాలయ పుస్తకాలు అందచేశారు. యూనిఛార్మ్ పరిశ్రమచే హైస్కూల్ బాలికలు 145 మందికి శానిటరీ నాప్కిన్స్ పంపిణి చేశారు. ఇకపై నెలనెలా శ్రీసిటీ పరిధిలోని రెండు ప్రభుత్వ హైస్కూల్స్, రెండు ప్రాథమికోన్నత పాఠశాలల బాలికలకు శానిటరీ నాప్కిన్స్ పంపిణి చేయనున్నట్లు యూనిఛార్మ్ పరిశ్రమ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో జపాన్ పరిశ్రమల బృంద ప్రతినిధి ఒగావా, శ్రీసిటీ ఫౌండేషన్ ప్రతినిధి రమేష్ సుబ్రహ్మణ్యం, మండల విద్యాశాఖాధికారి రవి, ప్రధానోపాధ్యాయులు మధు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="2260,2259,2258,2257"]
[gallery td_select_gallery_slide="slide" ids="2260,2259,2258,2257"]
No comments: