పాపం పసికూన....... - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

పాపం పసికూన.......

రవికిరణాలు(సెల్వం- రిపోర్టర్-తిరుమల) : సంవత్సరం వయస్సున్న బాబును తిరుమలలో వదిలి వెళ్ళిన గుర్తుతెలియని వ్యక్తులు. నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడే డీఎన్ బీ రోడ్డులోని విశ్రాంతి తీసుకునే రేకుల షేడ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం అర్దరాత్రి 2గంటల నుంచి ఓ బాబు ఎడుస్తునే ఉన్నాడటాన్ని భక్తులు గుర్తించారు. ఆ బాబు వద్ద ఎవ్వరూ లేకపోవడంతో అనుమానం వచ్చిన భక్తులు రెండవ పట్టణ పోలీసులకి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న సీఐ వెంకట్ రవి ఆ సంవత్సరం బాబును స్వాదీనం చేసుకున్నారు, బాబు తో పాటు ఉన్న ఓ బ్యాగులో పాలడబ్బాలు.. సెరీలాక్ ప్యాకెట్లు ఉన్నట్టు గుర్తించారు...దీంతో బాబును తల్లిదండ్రులే వదిలి పెట్టి ఉండవచ్చని పోలీసులు బావిస్తున్నారు . బాబుని శిశుసంక్షేమ శాఖ అధికార్లకి అప్పచెప్పిన తిరుమల టుటౌన్ పోలీసులు, ఆధారాలు ఏదయినా లభ్యమవుతుందని సీసీ టీవీ ఫుటేజ్ద్వారా పరిశీలిస్తున్నారు.
పాపం పసికూన....... Reviewed by CHANDRA BABU on July 29, 2017 Rating: 5 రవికిరణాలు(సెల్వం- రిపోర్టర్-తిరుమల) : సంవత్సరం వయస్సున్న బాబును తిరుమలలో వదిలి వెళ్ళిన గుర్తుతెలియని వ్యక్తులు. నిత్యం భక్తుల రద్దీతో కిటకి...

No comments: