నూతన అగ్నిమాపక కేంద్రం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

నూతన అగ్నిమాపక కేంద్రం

రవికిరణాలు(తడ రిపోర్టర్ - వెంకట్‌కుమార్‌) : శ్రీసిటీలో నూతన అగ్నిమాపక కేంద్రం శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్ర విపత్తుల స్పందన, అగ్నిమాపక సర్వీసుల డైరెక్టర్ జనరల్ కె.సత్యనారాయణ సమక్షంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ పి.ఎస్.ప్రద్యుమ్న అగ్నిమాపక కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు, డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ కె.బలరాంనాయక్, రీజినల్ ఫైర్ ఆఫీసర్ మురళీమోహన్,శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, జెట్రో ప్రతినిధి యుకిహికో ఒకునో, జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ గతంలో ఫైర్ సర్వీసెస్ క్లియరెన్స్ కోసం పరిశ్రమలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగేదని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు. ఆ శాఖ కూడా సింగల్ డెస్క్ ప్రాసెస్ లో చేరి స్నేహపూర్వ వాతావరణంలో పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తోందని పేర్కొన్నారు. జిల్లాలో సరాసరిగా 8.6 రోజుల్లోనే పరిశ్రమలకు అన్ని రకాల క్లియరెన్స్ లు ఇస్తున్నట్లు తెలిపారు. 2006 లో శ్రీసిటీ భూసేకరణకు వచ్చినపుడు ఇలాంటి అభివృద్ధి జరుగుతుందని ఊహించలేదన్నారు. అందరూ చాలా చేయాలనుకుంటారని, కొన్ని మాత్రమే కార్యరూపం దాల్చుతాయని, అందులో శ్రీసిటీ ఒకటన్నారు. ఆనాడు చెప్పినవన్నీ చేసి చూపారంటూ శ్రీసిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డిని ప్రశంసించారు. డైరెక్టర్ జనరల్ కె.సత్యనారాయణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 15 రోజుల్లో శ్రీసిటీలో తాత్కాలిక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేశామని, అతిత్వరలో పూర్తిస్థాయి సిబ్బంది, భవనాలతో శాశ్వత స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. తమ సిబ్బంది ఖాళీ వేళల్లో పరిశ్రమలోని సెక్యూరిటీ, ఇతర సిబ్బందికి ఫైర్ ఫైటింగ్, ఫైర్ సేఫ్టీపై శిక్షణ ఇచ్చే
కార్యక్రమాలు చేపడతామన్నారు. ఫైర్ సిబ్బంది గతంలో ఫైర్ ఫైటర్లగానే పనిచేసేవారిని, ప్రస్తుతం రోడ్ యాక్సిడెంట్లు ఇతర ప్రమాదాలలో కూడా సహాయకారులుగా పనిచేస్తున్నారని అన్నారు. ఇందుకు వారికి తగు తర్ఫీదు ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు మాట్లాడుతూ, శ్రీసిటీలో ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారని, ఇందులో ఫైర్ స్టేషన్ ఏర్పాటు కాగా, త్వరలో హైటెక్ పోలీస్ స్టేషన్ ప్రారంభమవుతుందన్నారు. శ్రీసిటీలో పరిశ్రమలే కాకుండా పలు విద్యాసంస్థలు, నివాస సముదాయాలు కూడా ఏర్పాటు కానున్న దృష్ట్యా ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్ ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ, ఫైర్ స్టేషన్ ప్రారంభం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 15 రోజుల్లో శ్రీసిటీలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తానంటూ తనను కోరిన జెట్రో జపనీస్ బృందానికి ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం, సీఎం ఆదేశాలతో అధికారులు వేగంగా స్పందించి కార్యరూపంలోకి తీసుకురావడం, బహుశా దేశంలో ఎక్కడ ఇలాంటి పరిణామం జరిగివుండదంటూ పేర్కొన్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో మంచి ఫలితాలు సాధించవచ్చు అనడానికి ఇది రుజువన్నారు.

[gallery td_select_gallery_slide="slide" ids="2492,2487,2488,2491,2490,2489"]
నూతన అగ్నిమాపక కేంద్రం Reviewed by CHANDRA BABU on July 29, 2017 Rating: 5 రవికిరణాలు(తడ రిపోర్టర్ - వెంకట్‌కుమార్‌) : శ్రీసిటీలో నూతన అగ్నిమాపక కేంద్రం శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్ర విపత్తుల స్పందన, అగ్నిమాపక సర్...

No comments: