రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : సమస్యల పరిష్కారం కోసం తానే జనం వద్దకు వస్తానని నగర్ మేయర్ అబ్దుల్ అజీజ్ వెల్లడించారు. నగరంలోని 9వ డివిజన్‌లో మేయర్ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. గత వారం వాటర్ ట్యాంక్‌లో పడి యువతి మరణించిన ఘటనపై మేయర్ ప్రజలతో మాట్లాడారు. ప్రజలకు మంచినీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంక్‌పైకి సిబ్బంది తప్ప వేరే వాళ్లు వెళ్లకూడదని అధికారులను ఆదేశించారు. ట్యాంక్ పైకి ఎక్కి పరిసరాలను పరిశీలించారు. ట్యాంక్ పై మద్యం బాటిళ్లు పడి ఉండడంపై మేయర్ మండిపడ్డారు. నగరంలో ఉన్న అన్ని ట్యాంకుల వద్ద నిషేధ అజ్ఞలు విధించనున్నట్లు తెలిపారు. కొత్త వాటర్ ట్యాంకుల నిర్మాణాలకు టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు.
https://www.youtube.com/watch?v=XswBAfj_hr0
https://www.youtube.com/watch?v=XswBAfj_hr0
No comments: