రవికిరణాలు(కర్నూలు రిపోర్టర్ - ఖలీల్ భాషా) : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వెంకటాపురం కాలనీలోని వెంకటేశ్వర దేవాలయంలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత కొన్ని ఏళ్లుగా శ్రావణమాసం మొదటి శనివారం వర్షాలు బాగా కురిసి రైతులు ఆశించిన స్థాయిలో పంటలు పండి మంచి లాభాలు రావాలని పూజలు జరిపారు. అనంతరం వెంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి తుంగభద్ర నదిలో నీటిని తీసికొని రావడానికి బయలుదేరుతారు. ఆ సమయంలో అనారోగ్యానికి గురైన ప్రజలు వారు దేవాలయం చుట్టూ దొర్లుతు 5 సార్లు ప్రదక్షిణలు చేయాలి. అలా చేసి తుంగభద్ర నదిలో నీటికి కోసం నడుచుకుంటూ వెళ్ళితే తమ ఆరోగ్య సమస్యలు బాగు పడతాయని ప్రజలు వింత ఆచారన్ని కొనసాగిస్తున్నారు. ఈ రోజులలో ప్రజలకు అందుబాటులో టెక్నాలజీ వైద్యం ఉన్న దేవుడిపై నమ్మకంతో ఈ లాంటి వింత ఆచారాలు కోసాగుతూనే ఉన్నాయి.
వింత ఆచారం....
వింత ఆచారం....
Reviewed by CHANDRA BABU
on
July 30, 2017
Rating: 5
రవికిరణాలు(కర్నూలు రిపోర్టర్ - ఖలీల్ భాషా) : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వెంకటాపురం కాలనీలోని వెంకటేశ్వర దేవాలయంలో ప్రజలు ప్రత్యేక...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: