అలిపిరిలో మద్యం, గంజాయి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

అలిపిరిలో మద్యం, గంజాయి

రవికిరణాలు(తిరుమల రిపోర్టర్ - సెల్వం) : తిరుమల అలిపిరి చెక్‌పాయింట్‌ వద్ద సోమవారం ఉదయం పలు నిషేధిత వస్తువులను ఎస్పీఎఫ్‌, టిటిడి సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు చెందిన మూడు వాహనాల్లో 7 మద్యం బాటిళ్లు, 100 గ్రాముల గంజాయి, ఇతర నిషేధిత వస్తువులను గుర్తించారు. నిషేధిత వస్తువులు కలిగివున్న వ్యక్తులను ఎక్సైజ్‌ అధికారులకు అప్పగించారు. నిషేధిత వస్తువులను గుర్తించిన ఎస్పీఎఫ్‌, టిటిడి సెక్యూరిటీ సిబ్బందిని సివిఎస్‌వో రవికృష్ణ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు సివిఎస్‌వో శివకుమార్‌రెడ్డి, ఎస్పీఎఫ్‌ డీఎస్పీ శంకర్‌రావు, ఎవిఎస్‌వో గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
అలిపిరిలో మద్యం, గంజాయి Reviewed by CHANDRA BABU on July 24, 2017 Rating: 5 రవికిరణాలు(తిరుమల రిపోర్టర్ - సెల్వం) : తిరుమల అలిపిరి చెక్‌పాయింట్‌ వద్ద సోమవారం ఉదయం పలు నిషేధిత వస్తువులను ఎస్పీఎఫ్‌, టిటిడి సెక్యూరిటీ స...

No comments: