రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : అంగన్‌వాడీ కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల ఆధునీకరణలో భాగంగా ఆంగ్లంలో తరగతులు నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ అధికారి ప్రశాంతి తెలిపారు. అంగన్‌వాడీ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన జరిగేందుకు డిజిటల్ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీల ఆధుకీరణను తొలుత నెల్లూరు జిల్లా నుంచే ప్రారంభించడం పట్ల మేయర్ సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలో 4వ డివిజన్ కిసాన్‌నగర్ లో అభివృద్ధి చేసిన అంగన్‌వాడీ కేంద్రాన్ని నగర్ మేయర్ అబ్దుల్ అజీజ్, కమిషనర్ ఢిల్లీరావు, ఐసీడీఎస్ అధికారి ప్రశాంతి పరిశీలించారు.
https://www.youtube.com/watch?v=lMAxxr-Ut8g
https://www.youtube.com/watch?v=lMAxxr-Ut8g
No comments: