రవికిరణాలు(వెంకటగిరి రిపోర్టర్ - చిన్నారావు) : నెల్లూరు జిల్లా వెంకటగిరి శాసనసభ్యుడు కురుగొండ్ల రామకృష్ణ మున్సిపాలిటీ పరిధిలోని 14,16,23,24 వార్డులలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా వార్డులలో జరుగుతున్న డ్రైనేజి కాలువ పనుల పురోగతిపై సమీక్షించి త్వరితగతిన పనులను పూర్తి చేసి పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని కమిషనర్ నరేంద్ర కుమార్, డీఈ గోపాల్‌లను ఆదేశించారు. గ్రామశక్తి పోలేరమ్మ ఆలయం ముందు నూతనంగా నిర్మించబోయే బొమ్మిడి కాలువ పనులను త్వరలో ప్రారంభిస్తామని వ్యాపారులు కూడా సహకరించాలని కోరారు. కాలువపై భాగాన ఉన్న దుకాణాలను తొలగించి వారికి వెనుక వైపు దుకాణాలు ఏర్పరుచుకునేల తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం పోలేరమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటనలో ఆయనతో పోలేరమ్మ ఆలయ ఛైర్మన్ చంద్రారెడ్డి, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు కెవికె ప్రసాద్, టీడీపీ నాయకులు గంగాధర్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
డ్రైనేజి కాలువ పనుల పురోగతిపై సమీక్ష
July 30, 2017
coorporation,
kurugodla,
MLA,
problams,
ramakrishna,
venkatagiri,
Video,
ఆంధ్రప్రదేశ్,
నెల్లూరు,
వెంకటగిరి
డ్రైనేజి కాలువ పనుల పురోగతిపై సమీక్ష
Reviewed by CHANDRA BABU
on
July 30, 2017
Rating: 5
రవికిరణాలు(వెంకటగిరి రిపోర్టర్ - చిన్నారావు) : నెల్లూరు జిల్లా వెంకటగిరి శాసనసభ్యుడు కురుగొండ్ల రామకృష్ణ మున్సిపాలిటీ పరిధిలోని 14,16,23,24 ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: